జాతీయ వార్తలు

అలజడే వాళ్ల అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్ల్లాం (కేరళ), డిసెంబర్ 15: నిరంతరం రాద్ధాంతం సృష్టిస్తూ పార్లమెంట్‌ను కొనసాగనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడంగా ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఇప్పటికీ కాంగ్రెస్ దిగమింగుకోలేక పోతోందని అన్నారు. అందుకే పార్లమెంట్‌ను అడుగడుగునా అడ్డుకోవడం ద్వారా దేశాభివృద్ధికి అవరోధాలు, ఆటంకాలు కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సవ్యంగా, సజావుగా పనిచేయాలంటే చర్చించడం, విభేదించడం, నిర్ణయించడమే పరమావధి కావలన్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ హితబోధనలను కాంగ్రెస్ ఎంత మాత్రం ఖాతరు చేయడం లేదని అన్నారు. వీటి స్థానే పార్లమెంట్‌లో చర్చకు ఎలాంటి అవకాశం లేకుండా చేస్తోందన్నారు. జిఎస్‌టి బిల్లుపై పక్షం రోజుల క్రితం కాంగ్రెస్ అధినేత్రి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో జరిపిన సయోధ్య చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వక పోవడంతో ప్రధాని మోదీ నేరుగానే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాము ఎలాగూ ఓడిపోయాం కాబట్టి పార్లమెంట్‌ను కూడా కొనసాగనివ్వకూడదన్న ధ్యేయంతోనే ఈ వ్యక్తులు పని చేస్తున్నారని మోదీ అన్నారు. తమ చర్యల వల్ల దేశానికి ఎలాంటి నష్టం కలిగినా వారికి ఏ మాత్రం పట్టడం లేదన్నారు. రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా మోదీ మంగళవారం ఎస్‌ఎన్‌డిపి కార్మికులనుద్దేశించి మాట్లాడారు. దేశంలో పెచ్చరిల్లుతున్న అసహన ధోరణుల గురించి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడినప్పుడు కొందరు దానిపై విస్తృతంగా రోజుల తరబడి చర్చించారని, కానీ పార్లమెంట్ నిర్వహణకు సంబంధించి రెండు రోజుల క్రితం ఆయన చెప్పిన మాటలు తమకు పట్టనట్టుగానే కాంగ్రెస్ వ్యవహరించిందన్నారు. అవరోధాలు, ఆటంకాలే కాంగ్రెస్ అజెండాగా మారాయని, కానీ తమ ప్రభుత్వం మాత్రం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతుందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర మాజీ ప్రధాని ఆర్.శంకర్ విగ్రహాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించిన మోదీ ‘ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది’అని తెలిపారు.

చిత్రం.. కొల్లాంలోని ఎస్‌ఎన్ కళాశాలలో నిర్వహించిన సభలో నరేంద్ర మోదీకి మెమెంటో అందిస్తున్న కేరళ నేతలు