జాతీయ వార్తలు

సెప్టెంబర్‌లో రాహుల్‌కు పగ్గాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 6: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్ట్భాషేకం సెప్టెంబర్ నెలాఖరులో ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించేందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని పనులు సక్రమంగా జరిగితే సెప్టెంబర్ నెలాఖరులో ఆయనను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు వెల్లడించారు. రాహుల్ గాంధీ పదోన్నత వ్యవహారం ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సెప్టెంబర్ నెలాఖరులో జరుగుతుందని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. రాహుల్‌ను పార్టీ అధ్యక్షుడిగా నియమించటంతోపాటు ఏఐసిసి పునర్ వ్యవస్థీకరణ కూడా జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోనియా గాంధీ ఇప్పటికే ఈ పని పూర్తిచేశారని, జాబితాలు కూడా సిద్ధంగా ఉన్నాయని వారంటున్నారు. ఏఐసిసి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పునర్ వ్యవస్థీకరణంలో సీనియర్ నాయకులకు కూడా సముచిత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ సూచన మేరకు పార్టీ పదవుల నియామకాల్లో యువతకు పెద్దపీట వేస్తున్నారు. దాదాపు ఎనభై శాతం పదవులను యువతకు కేటాయించాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన. అయితే పార్టీకి సీనియర్ నాయకుల నాయకత్వం, సూచనలు, సలహాలు ఎంతో అవసరం, పార్టీకి వారి అనుభవం ఎంతో తోడ్పడుతుంది కాబట్టి కమిటీల్లో దాదాపు నలభై శాతం పదవులను సీనియర్ నాయకులకు కేటాయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నలభై శాతం మంది సీనియర్ నాయకులు, అరవై శాతం మంది యువ నాయకులతో ఏఐసిసి కార్యావర్గం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాబితాలను సిద్ధం చేశారని అంటున్నారు.
ప్రియాంక ప్రచారంపై చర్చ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు ప్రియాంకా గాంధీని ఉపయోగించుకోవటంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం నాలుగు వందల నాలుగు సీట్లుంటే ఇందులో నుండి కనీసం 250 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రియాంకా గాంధీతో రానున్న ఎన్నికల్లో ప్రచారం చేయించాలని పార్టీకి చెందిన ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రతిపాదించారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించవలసిన వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న ఎన్నికల నిపుణుడు ప్రశాంత్ కిశోర్ కూడా ప్రియాంకా గాంధీతో ఎన్నికల ప్రచారం చేయించాలని ప్రతిపాదించటం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకున్న నిర్ణయం ప్రకారం జూలై నెల నుండే ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించవలసి ఉంది. అయితే రాహుల్ గాంధీ కొన్ని కీలక అంశాలపై ఇంకా ఒక అభిప్రాయానికి రానుందున ఎన్నికల ప్రచారం ప్రారంభం కాలేదని ఆ వర్గాలు చెబుతున్నాయి.