జాతీయ వార్తలు

ఇది అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: కృష్ణా నదీ జలాల వివాదం నాలుగు రాష్ట్రాలకు సంబంధించినది. ఎగువ రాష్ట్రాలను వదిలేసి తెలంగాణ, ఏపీల మధ్య నీటి పంపకాలు సాగితే, భవిష్యత్‌లో తెలంగాణకు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ వాదనలు వినిపించింది. కృష్ణా నదీ జలాల వివాదాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం తన వాదన వినిపించింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తెలంగాణ నైసర్గిక స్వరూపం మూలంగా రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని త్రీడీ మ్యాప్ ద్యారా ట్రిబ్యునల్‌కు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సాగుభూమి, జనాభా ప్రాతిపదికన నీటి కేటాయింపులు జరపాలని తెలంగాణ వాదించింది. 1940 నుంచి తెలంగాణ ప్రాంతానికి నీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతూనే ఉందని వివరించారు. రాష్ట్రంలోని కృష్ణా బేసిన్‌లో రెండు కోట్ల ప్రజానీకం ఉన్నప్పటికి, వారికి రావాల్సిన న్యాయపరమైన నీటి వాటా రాలేదని ట్రిబ్యునల్‌కు తెలంగాణ వివరించింది. ఉమ్మడి ఏపీలో కేటాయించిన 811 టిఎంసిలో తెలంగాణకు 298 టిఎంసిలు కేటాయింస్తే, వాస్తవరూపంలో కేవాలం 260 టిఎంసిలే తెలంగాణకు వచ్చాయని వైద్యనాథన్ వివరించారు. ఈ కేటాయింపుల్లో ఏపీకే ఎక్కువ జలాలు వెళ్లాయన్నారు. దీనికి సంబంధించి రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నీటి కేటాయింపు వివరాలను వైద్యనాథన్ ట్రిబ్యునల్‌కు సమర్పిచారు. తెలంగాణ నైసర్గిక రూపంపై అవగాహన వస్తేనే నీటి కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయం అర్థమవుతుందని, అందుకోసం త్రీడీ మ్యాప్ ద్వారా వివరిస్తామని తెలంగా వాదించటంతో ట్రిబ్యునల్ అందుకు అంగీకరించింది. త్రీడీ మ్యాప్ ద్యారా ఆల్‌మట్టి, శ్రీశైలం డ్యాం వరకూ నీటి కేటాయింపులను వివరించారు. తెలంగాణలోని హైదరాబాద్ సహా మరికొన్ని ప్రాంతాలు ఎత్తుగా ఉండటం వల్ల నీటిని లిఫ్ట్‌చేసి తరలించే పరిస్థితి ఉందన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాదనలు వినిపించిన వైద్యనాథన్, మరికొంత సమయం కావాలని అభ్యర్థించటంతో ట్రిబ్యునల్ అంగీకరించింది. శనివారం సైతం తెలంగాణ తన వాదనలను ట్రిబ్యునల్‌కు వినిపించనుంది.