జాతీయ వార్తలు

అవకాశాన్ని అందిపుచ్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 8:పార్టీ ఫిరాయింపులతో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడుతున్న రాజకీయ శూన్యాన్ని అంది పుచ్చుకోవాలని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు. ఇతర పార్టీల నుంచి సమర్థులైనా నాయకులు పార్టీలోకి వస్తే..వారిని ఆహ్వానించాలని రాష్ట్ర న్యాయకత్వానికి ఆయన సూచించారు. బిజెపి కేంద్ర కార్యలయంలో శుక్రవారం ఉదయం ఏపీకి సంబంధించిన పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సారథ్యంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు,నిర్మలా సీతారామన్,రామ్‌మాధవ్, రాష్ట్ర పార్టీ కోర్ కమిటి సభ్యలు హజరైయ్యారు. అనంతరం ఏపీ భాజపా అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు విలేకరులతో మాట్లాడుతూ ఏపీలో పార్టీ బలోపేతం లక్ష్యంగా ఈ సమావేశం జరిగిందని వెల్లడించారు. రానున్న ఏడాది కాలంలో పార్టీ సంబంధించి నాలుగు కీలక సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశాలకు అమిత్ షా స్వయంగా హజరైవుతారని చెప్పారు. మొదటిగా వైజాగ్‌లో మండలస్థాయి పార్టీ పదాధికారుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు సదస్సు ,కడపలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా,విభజన హామీల అమలు,పోలవరం నిర్మాణం, రైల్వేజోన్ అంశాల పట్ల భాజపా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏపీ భాజపా అధ్యక్ష ఎంపిక అంశం చర్చ జరగలేదని, కొత్త అధ్యక్షుడుని ఎవరిని ఎంపిక చేయాలనేది పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చూసుకుంటారని వెల్లడించారు. ఆంధ్రప్రద్రేశ్‌లో భాజపా చేపడుతున్న సభ్యత్వ నమోదు,గ్రామ స్థాయి కమిటిల ఏర్పాటు,రాష్ట్ర పార్టీ బలోపేతానికి తీసుకున్న చర్యలను అమిత్ షాకు వివరించామని చెప్పారు.