జాతీయ వార్తలు

హైకోర్టుకు వెళ్లండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: వైకాపా పార్టీ ఫిరాయింపులపై దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలపై శాసన సభ స్పీకర్ పట్టించుకోవడం లేదని, ఫిర్యాదులను తక్షణం పరిష్కరించేలా ఆదేశించాలంటూ వైకాపా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా పార్టీ ఫిరాయింపులపై విచారణను హైకోర్టు త్వరగా పూర్తి చేస్తుందన్నా ఆశాభావం ఈ సందర్భంగా ధర్మాసనం వ్యక్తం చేసింది. వైకాపా పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ లావునాగేశ్వరావుతో కూడిన ధర్మాసనం విచారించింది. వైకాపా తరుపున సీనియర్ న్యాయవాది సోలి సోరాబ్జీ, శంకర్ నారాయణన్ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. జస్టిస్ దవే స్పందిస్తూ మీరు హైకోర్టు వెళ్లొచ్చు కాదా? అని ప్రశ్నించారు. సోలిసొరాబ్జీ వాదనలు వినిపిస్తూ త్వరగా నిర్ణయం తీసుకోవాలని మీరు స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. జస్టిస్ నాగేశ్వరరావు జోక్యం చేసుకుంటూ వైకాపా పిటిషన్ స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉందా? పరిష్కరించినట్టు పత్రికల్లో చదివానని అన్నారు. పార్టీ ఫిరాయింపుల పిటిషన్లు స్పీకర్ వద్దే పెండింగ్‌లో ఉన్నయని ధర్మాసనానికి పిటిషనర్ స్పష్టం చేశారు. దీనిపై హైకోర్టు వెళ్లాలని వైకాపా తరపు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది.