జాతీయ వార్తలు

బలప్రయోగం మితిమీరకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: మణిపూర్‌లో సైనిక, పారామిలటరీ దళాలు మితిమీరిన బలప్రయోగానికి, ప్రతీకార దాడులకు దిగకూడదని, ఇటువంటి ఉదంతాలేమైనా జరిగి ఉంటే ఆ ఘటనలపై దర్యాప్తు జరపాల్సిందేనని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. మణిపూర్‌లో బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించిన వివరాలను సమర్పించాలని జస్టిస్ ఎం.బి.లోకుర్, జస్టిస్ యు.యు.లలిత్‌లతో కూడిన ధర్మాసనం అమికస్ క్యూరీని ఆదేశించింది. మణిపూర్‌లో బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగాయన్న ఆరోపణలపై సైనిక దళం కూడా సొంతగా దర్యాప్తు జరుపుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. తగిన బలం లేక ‘కోరలు లేని పులి’ మాదిరిగా కొనసాగుతున్న తమకు మరిన్ని అధికారాలను కల్పించాల్సిన అవసరం ఉందని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని కూడా సుప్రీం కోర్టు వెల్లడించింది. కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలను కల్పిస్తున్న చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సురేష్ సింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతూ సర్వోన్నత న్యాయస్థానం పై విషయాలను స్పష్టం చేసింది.
మణిపూర్‌లో సాయుధ బలగాల ఎదురు కాల్పుల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారాన్ని చెల్లించడాన్ని చూస్తుంటే ఇవన్నీ బూటకపు ఎన్‌కౌంటర్లేనన్న విషయం స్పష్టమవుతోందని సుప్రీం కోర్టు పేర్కొంది.