జాతీయ వార్తలు

మోదీ కేబినెట్‌లో 72మంది కోటీశ్వరులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: తాజా మంత్రివర్గ విస్తరణతో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కోటీశ్వరుల సంఖ్య 72కు చేరుకుందని, అలాగే క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించిన మంత్రుల సంఖ్య 24కు పెరిగిందని ఢిల్లీకి చెందిన ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో పేర్కొంది. లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎన్నికల కమిషన్‌కు అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్‌లలో పేర్కొన్న వివరాల ఆధారంగా ఆ సంస్థ ఈ అధ్యయనం జరిపింది. కొత్తగా మంత్రివర్గంలో చేర్చుకున్న మంత్రుల సగటు ఆస్తి రూ. 8.73 కోట్లని, దీంతో మొత్తం మత్రివర్గం సగటు ఆస్తి రూ. 12.94 కోట్లకు చేరుకుందని ఆ సంస్థ తెలిపింది.
కొత్తగా మంత్రివర్గంలో చేరిన మంత్రుల్లో మధ్యప్రదేశ్‌నుంచి రాజ్యసభకు ఎన్నికయిన ఎంజె అక్బర్ అత్యధికంగా రూ. 44.90 కోట్ల ఆస్తులను ప్రకటించగా, రాజస్థాన్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు పిపి చౌధరి (రూ.35.35 కోట్లు), విజయ్ గోయల్ (రూ. 28.97 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కోటి రూపాయలకు పైగా ఆస్తులు కలిగిన కొత్త మంత్రుల్లో రమేశ్ జిగజినాగి, పురుషోత్తమ్ ఖందూభాయ్ రూపాలా, అనుప్రియ సింగ్ పటేల్, మహేంద్ర నాథ్, ఫగన్ సింగ్ కులస్తే, రాజెన్ గోహిన్, ఎస్‌ఎస్ అహ్లూవాలియా, అర్జున్ రామ్ మేఘ్వాల్, సిఆర్ చౌధరి, మన్‌సుఖ్‌భాయ్లక్ష్మణ్ భాయ్ మాండవీయ, కృష్ణరాజ్ ఉన్నారు. ఈ సంస్థ నివేదిక ప్రకారం మోదీ మంత్రివర్గంలోని మొత్తం 78 మంది మంత్రుల్లో తొమ్మిది మంత్రి 30 కోట్లు, అంతకంటే ఎక్కువ ఆస్తులను కలిగి ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించారు. వారిలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (రూ.113 కోట్లు), ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ (రూ.108 కోట్లు).విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ (రూ.95 కోట్లు) ఉన్నారు. కాగా, కొత్తగా కేంద్రమంత్రివర్గంలో చేరిన మంత్రుల్లో మధ్యప్రదేశ్‌నుంచి రాజ్యసభ సభ్యుడయిన అనిల్ మాధవ్ దవే అందరికన్నా తక్కువగా రూ.60.97 లక్షల ఆస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం ఆరుగురు మంత్రులు కోటికన్నా తక్కువ ఆస్తులున్నట్లు డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. కొత్తగా మంత్రివర్గంలో చేరిన వారిలో ఏడుగురు తమపై క్రిమినల్ కేసులున్నట్లుగా అఫిడవిట్‌లలో పేర్కొన్నారు. దీంతో మోదీ కేబినెట్‌లో క్రిమినల్ కేసులున్న మంత్రుల సంఖ్య 24కు చేరుకుంది. కాగా, కేబినెట్‌లో మంత్రుల వయసు విషయానికి వస్తే ముగ్గురు మంత్రులు 31-40 ఏళ్ల మధ్యవారు కాగా, 44 మంది 41-60 ఏళ్ల మధ్య వయసు వారున్నారు. మరో 31 మంది 61-89 ఏళ్ల మధ్య వయసు వారున్నారు. కేబినెట్‌లో తొమ్మిది మంది మహిళా మంత్రులున్నారు. 78 మంది మంత్రుల్లో 14 మంది 12వ తరగతి పాస్ అంతకన్నా తక్కువ విద్యార్హతలున్నట్లు పేర్కొనగా, 63 మంది గ్రాడ్యుయేషన్ అంతకన్నా పైగా విద్యార్హతలు కలిగి ఉన్నారు.