జాతీయ వార్తలు

బర్గర్లు, పిజ్జాలపై కేరళలో పన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జూలై 8: కేరళలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం 2016-17 బడ్జెట్‌లో సంక్షేమపథకాలు, ప్రజారోగ్యం, విద్యకు పెద్దపీట వేసింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్యాక్డ్ఫుడ్‌పై ఐదుశాతం పన్ను, అలాగే బర్గర్లు, పిజ్జాలపై ‘్ఫ్యట్‌టాక్స్’ 14.5 శాతం పన్ను ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుతం పన్నుల ద్వారా ఆదాయాలు సమకూర్చుకోవాలని నిర్ణయించింది. బ్రాండెడ్ రెస్టారెంట్లలో ఈ ఫ్యాట్‌టాక్స్ వసూలు చేస్తారు. వివిధ కారణాల వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ఎల్‌డిఎఫ్ ప్రయత్నాలు ప్రారంభించింది. 12,000 కోట్ల రూపాయలతో యాంటీ షోడౌన్ ప్యాకేజీ బడ్జెట్‌లో పొందుపరిచారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఇస్సాక్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పన్నుల ద్వారా ఆదాయం సమకూర్చుకోనున్నట్టు ఆయన తెలిపారు. వచ్చే ఐదేళ్లలో వివిధ రంగాల్లో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు ఆహ్వానించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జూన్ నుంచి కొత్త పెన్షన్ల పథకం అమలుచేస్తున్నట్టు, ఇక నుంచి నెల ముందే పెన్షన్ అందుతుందని వెల్లడించారు.
మహిళా కమిషన్ సమన్లను
ధిక్కరించిన సల్మాన్ ఖాన్
న్యూఢిల్లీ, జూలై 8: అత్యాచారంపై వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ శుక్రవారం ఈ వ్యవహారంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) ఎదుట హాజరు కాకుండా సమన్లను ధిక్కరించాడు. అయితే సల్మాన్ న్యాయ బృందం నుంచి తమకు సమాధానం వచ్చిందని, దీనిని పరిశీలించి తదుపరి చర్య తీసుకుంటామని మహిళా కమిషన్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ‘సల్మాన్ ఖాన్ గానీ ఆయన న్యాయ బృందం గానీ శుక్రవారం మా ఎదుట హాజరు కాలేదు. కానీ సల్మాన్ న్యాయ బృందం నుంచి మాకు సమాధానం వచ్చింది. ప్రస్తుతం మేము ఈ సమాధానాన్ని పరిశీలిస్తున్నాం’ అని మహిళా కమిషన్ ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే సల్మాన్‌పై చేపట్టే చర్య ఏమిటనే విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ లలితా కుమారమంగళం వెల్లడించలేదు.
ఎక్కడున్నా
జీవితం సాగాలిగా!
విజయ్‌మాల్యా వేదాంతం
సిల్వర్‌టోన్, జూలై 8: ‘ఎక్కడున్నా జీవితం సాగిపోవాలిగా’ అని లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అన్నారు. బ్యాంకురుణాల ఎగవేత, మనీ లాండరింగ్ లాంటి పలు ఆర్థిక నేరాలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న విజయ్ మాల్యా ఈ ఏడాది ప్రారంభంనుంచి బ్రిటన్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే. ముంబయి కోర్టు ఒకటి ఆయనను పరారీలో ఉన్న నేరస్థుడిగా సైతం ప్రకటించింది. అయితే ఆయన జనం మధ్యకు వచ్చిన సంఘటనలు చాలా తక్కువ. కాగా, నార్తాంప్టన్‌షైర్‌లోని సిల్వర్‌స్టోన్‌లో జరిగే బ్రిటీష్ గ్రాండ్‌ప్రీ రేస్‌ల్లో పాల్గొంటున్న తన టీమ్ సహారా ఫోర్స్ ఇండియాకు ప్రోత్సాహం ఇవ్వడం కోసం మాల్యా శుక్రవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా వాళ్లతో కొద్దిసేపు మాట్లాడారు. తనకు రేసింగ్ అంటే చాలా ఇష్టమని, తాను ఈ టీమ్‌ను కొనుగోలు చేయడానికి అదే ప్రధాన కారణమని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం తన పాస్‌పోర్టును రద్దు చేసిన కారణంగా ఎక్కడికీ వెళ్లలేకపోవడం చికాకుగానే ఉందని మాల్యా చెప్పారు.
రైతు ఇంట పంటల సమాచారం
కృషి విజ్ఞాన్ పోర్టల్ ప్రారంభం
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, జూలై 8: దేశంలోని కోట్లాది మంది రైతులకు వ్యవసాయ సంబంధ సమాచారాన్ని అందజేయటంతోపాటు పంటల విషయంలో మార్గదర్శనం చేసేందుకు ఉద్దేశించిన కృషి విజ్ఞాన్ కేంద్ర వెబ్ పోర్టల్ ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ శుక్రవారం కృషి విజ్ఞాన్ పోర్టల్‌ను ప్రారంభించారు. దేశంలో ప్రస్తుతం 645 కృషి విజ్ఞాన్ కేంద్రాలున్నాయని ఆయన అన్నారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఈ కేంద్రాలు ఒక్కొక్కటి దాదాపు వెయ్యి మంది రైతులకు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు.
కృషి విజ్ఞాన్ కేంద్రాల్లో లభిస్తున్న వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని ఇప్పుడు దేశంలోని రైతులందరికీ అందుబాటులోకి వస్తుందని రాధామోహన్ సింగ్ ప్రకటించారు. ఈ కేంద్రాలల్లోని సమాచారాన్ని పోర్టల్‌లో పొందుపరుస్తారని ఆయన వివరించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమాచారం ఇందులో లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. కృషి విజ్ఞాన్ కేంద్రాలను పర్యవేక్షించేందుకు జాతీయ స్థాయిలో ఒక వ్యవస్థ లేకపోవటంతో ఆశించిన ఫలితాలు ఉండేవికాదని, ఇప్పుడు పోర్టల్ ఏర్పాటు ద్వారా దాన్ని భర్తీ చేయవచ్చని మంత్రి స్పష్టం చేశారు. కెవికె పోర్టల్ రైతులకు వ్యవసాయ సంబంధమైన పూర్తి సమాచారాన్ని అందజేయటంతోపాటు పంటలకు సంబంధించి మార్గదర్శనం కూడా చేస్తుందని రాధామోహన్ చెప్పారు. రైతులకు ఆయా పంటలకు సంబంధించిన సమాచారాన్ని, వాతావరణ సంబంధ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేసేందుకు పోర్టల్ ఎంతో తోడ్పడుతుందని మంత్రి తెలిపారు.