జాతీయ వార్తలు

శరణ క్షేత్ర... జరగని రథయాత్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్హంపూర్ (ఒడిశా), జూలై 8: సాక్షాత్తూ జగన్నాథునికే ఆ ఆలయం ఒకప్పుడు ఆశ్రయమిచ్చింది. ముస్లిం పాలకుల ఆక్రమణదారులనుంచి ఆయనకు ఏకంగా రక్షణ కల్పించింది. అయినా ఏం లాభం? ఒడిశా సహా దేశవ్యాప్తంగా ఎంతో భక్తిశ్రద్ధలతో జగన్నాథ రథయాత్ర జరిగినా అక్కడ మాత్రం రథచక్రాలు కదల్లేదంటే ఆశ్చర్యపడాల్సిందే. రథయాత్ర మాట జగన్నాథుడెరుగు... కనీసం ఎలాంటి సందడి కూడా లేదు. శరణ క్షేత్రగా పిలవబడే ఆ ఆలయం గంజాం జిల్లాలోని మరదాలో ఉంది. మూడు శతాబ్దాల క్రితం అంటే 1733-1735 మధ్య కాలంలో కళింగ ఆలయాల లక్ష్యంగా ముస్లిం పాలకులు దాడులు జరిపేవారు. వారి బారినుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పూరి జగన్నాథ ఆలయంలోని విగ్రహాలను మరదాలోని ఆలయంలో రహస్యంగా భద్రపరిచారు. దాడుల ఉద్ధృతి తగ్గి పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆ విగ్రహాలను మళ్లీ పూరి ఆలయంలో ప్రతిష్ఠించారు. దీంతో మరదాలోని ఆలయానికి ‘శరణ క్షేత్ర’ పేరు స్థిరపడిపోయింది. విగ్రహాలు మళ్లీ పూరి క్షేత్రానికి తరలిపోవడంతో శరణ క్షేత్రలో విగ్రహాలు లేవు, పూజలూ లేవు. భక్తుల రాక కూడా పూర్తిగా తగ్గిపోయి నిర్మానుష్యంగా మారిపోయింది. ఏడాదికోసారి ఘనంగా జరిగే జగన్నాథ రథయాత్రకు కూడా ఈ ఆలయం నోచుకోవడం లేదంటే ఎంతటి దీనావస్థలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్నాథుని భక్తులు, పరిశోధకులు ఎనిమిదేళ్ల కిందట ఈ ఆలయాన్ని సందర్శించి ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తామని హామీ ఇచ్చారు. పూరికి వచ్చే భక్తులు, సందర్శకులు మరదాను కూడా సందర్శించాలని వారు విజ్ఞప్తి చేశారు. మరదాను పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటిస్తే ఆలయ వైశిష్ట్యం ప్రపంచానికి తెలుస్తుందని పొలసరా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీకాంత్ సాహు పేర్కొన్నారు. పొలసరా నుంచి మరదా వరకు రెండు కిలోమీటర్ల మేర అప్రోచ్ రోడ్డును రూ.2.20 కోట్ల వ్యయంతో నిర్మించామని ఆయన తెలిపారు. మరదాలో కమ్యూనిటీ సెంటర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 లక్షలు మంజూరు చేసిందని, ఆలయ ప్రాంతంలో వౌలిక సదుపాయాల కోసం రూ.50 లక్షలు మంజూరు చేయాలని తాను ప్రతిపాదనలు పంపించానని ఆయన వెల్లడించారు. పూరికి వచ్చే భక్తుల్లో కనీసం పదిశాతం మంది మరదా వచ్చినా ఈ ప్రాంత ప్రాముఖ్యత వెలుగులోకి వస్తుందని అశోక్ నాయక్ అనే స్థానికుడు వ్యాఖ్యానించాడు. పర్యాటక ప్రాంతంగా ప్రకటించిన పక్షంలో ఈ ప్రాంతానికి సందర్శకులు, పరిశోధకుల తాకిడి పెరిగి ఆలయ విశిష్టత ప్రపంచానికి తెలిసే అవకాశముంది.