అంతర్జాతీయం

‘సోలార్ మామా’లతో మోదీ ముచ్చట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దార్-ఎస్-సలామ్, జూలై 10: నాలుగు ఆఫ్రికా దేశాల్లో పర్యటనలో భాగంగా టాంజానియా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ‘సోలార్ మామాలు’గా పిలిచే ఆరు ఆఫ్రికా దేశాలకు చెందిన 30 మంది గ్రామీణ మహిళా సోలార్ ఇంజనీర్లతో ముచ్చటించారు. ఆఫ్రికా దేశాలకు భారత ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సహాయంలో భాగంగా వీరందరికీ ఇళ్లలో వాడే సోలార్ ల్యాంపుల తయారీ, మరమ్మతు, నిర్వహణతో పాటు తేనె తీయడం, కుట్లు, అల్లికలులాంటి వృత్తి విద్యా కోర్సుల్లో రాజస్థాన్‌లోని టిలోనియా గ్రామంలో ఉండే బేర్‌ఫుట్ కాలేజిలో లేదా టాంజానియాలో శిక్షణ ఇచ్చారు. టాంజానియా, మరికొన్ని ఆఫ్రికా దేశాలకు చెందిన ఈ 30 మంది మహిళలు సోలార్ లాంతర్ల నిర్వహణతోపాటుగా తాము నేర్చుకున్న కళలను ప్రధాని మోదీ ఎదుట ప్రదర్శించారు. అలాగే ‘వుయ్‌షల్ ఓవర్‌కమ్’ అనే పాటను కూడా పాడారు. ఈ కార్యక్రమానికి టాంజానియా ఉప విదేశాంగ మంత్రి డాక్టర్ సుసాన్ కొలింబా, జాంజిబార్ మంత్రి సలామా అబౌద్ తాలిబ్ కూడా హాజరయ్యారు. ఆ మహిళలతో మాట్లాడిన తర్వాత మోదీ వారితో కలిసి ఫోటోలు దిగారు.
టాంజానియా పర్యటనలో ప్రధాని మోదీ కొద్దిసేపు వాయిద్యకారుడిగా మారిపోయారు. ఆదివారం స్టేట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమం సందర్భంగా టాంజానియా అధ్యక్షుడు జాన్ పొంబె జోసెఫ్ మగుబులితో కలిసి ఆయన కొద్దిసేపు అక్కడి సంప్రదాయ డ్రమ్స్ వాయించారు. టాంజానియా అధ్యక్షుడు జాన్ కొద్దిసేపు డ్రమ్స్ వాయించి ఆపేసినప్పటికీ మోదీ ఉత్సాహాన్ని చూసి మళ్లీ కొనసాగించారు.

చిత్రం... సోలార్ లాంతర్లు, ఇతర పరికరాలను తయారు చేస్తున్న మహిళలతో ముచ్చటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ