జాతీయ వార్తలు

తేజస్ బోగీల్లో వైఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కలిగిన తేజస్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఈ బోగీల్లో హైటెక్ వినోదంతో పాటు వైఫై, బ్రెయిలీ లిపి డిస్‌ప్లే బోర్డులు వంటి సకల సౌకర్యాలు కలిగివుంటాయి. ఈ బోగీలకు భూమ్యాకాశాల రంగులతో కూడిన వినైల్ పెయింటింగ్‌తో కనువిందు చేస్తాయి. ‘తేజస్, హమ్‌సఫర్, అంత్యోదయ, దీన్‌దయాల్ రైళ్ల బోగీల డిజైన్‌ను ఇప్పటికే ఖరారు చేశాం. వీటికనుగుణంగా బోగీలను తీర్చిదిద్దేలా సంబంధిత విభాగాలను ఆదేశించామ’ని సీనియర్ రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. తేజస్ బోగీల్లో ఎగ్జిక్యూటివ్ కోచ్, చైర్ కార్ ఉండగా, హమ్‌సఫర్‌లో థర్డ్ ఏసి సౌకర్యం ఉంటుంది. బోగీలను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు 22 కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నారు. ఎల్‌ఇడి బోర్డులు, వినోదం కలిగించే స్క్రీన్లు, సెల్‌ఫోన్ సాకెట్లు అందుబాటులో ఉంటాయి. బయో వాక్యూమ్ టాయలెట్లలో నీటి సామర్థ్యాన్ని తెలిపే ఇండికేటర్లు కూడా అమర్చుతున్నారు. స్టేషన్ల సమాచారం, ఎలక్ట్రానిక్ ప్యాసింజర్ చార్టులు, కాఫీ-టీ మెషీన్లు, మ్యాగజైన్లు అందుబాటులో ఉంటాయి. తేజస్, హమ్‌సఫర్ బోగీల్లో సిసి టీవీలు, నిప్పు, పొగలను గుర్తించే సాంకేతికతతోపాటు వాటిని నిరోధించే వ్యవస్థ కూడా ఈ బోగీల్లో ఉండటం విశేషం. బడ్జెట్‌లో ప్రతిపాదించిన మేరకు తేజస్, హమ్‌సఫర్, అంత్యోదయ, దీన్‌దయాల్ రైళ్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.