జాతీయ వార్తలు

కేంద్ర మంత్రులు హెప్తుల్లా, సిద్దేశ్వర రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లా, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జిఎమ్ సిద్దేశ్వరలు మంగళవారం మంత్రి పదవులకు రాజీనామా చేశారు. తన కేబినెట్‌లో పనిచేసే మంత్రుల గరిష్ఠ వయోపరిమితిని ప్రధాని మోదీ 75 సంవత్సరాలుగా నిర్దేశించారు. ఇందులో భాగంగానే 75 సంవత్సరాల నజ్మా హెప్తుల్లా, 64 సంవత్సరాల సిద్దేశ్వరలు తమ పదవులకు రాజీనామా చేశారు. వీటిని రాష్టప్రతి భవన్ ఆమోదించింది. ఇప్పటికే 75 సంవత్సరాలు దాటిన కల్‌రాజ్ మిశ్రాను కూడా రాజీనామా చేయాలని ప్రధాని కోరవచ్చునంటూ ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఊహాగానాలు వెలువడ్డాయి. 75 సంవత్సరాలు దాటిన కారణంగానే బిజెపి సీనియర్ నేతలైన అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోలేదు. అయితే వీరికి మార్గదర్శక మండలిలో స్థానం కల్పించారు. ఇప్పటి వరకూ మైనార్టీ వ్యవహారాల ఉప మంత్రిగా పనిచేసిన ముఖ్తర్ అబ్బాస్ నఖ్వీకి స్వతంత్య్ర మంత్రిగా బాధ్యతలు అప్పగించినట్టు రాష్టప్రతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. 75 సంవత్సరాల వయసు దాటిన లేదా సమీపిస్తున్న మంత్రులను రాజీనామా చేయాల్సిందిగా ఈ నెల 5న జరిగిన మంత్రివర్గ విస్తరణ సమయంలోనే మోదీ కోరారు. అయితే అప్పట్లో హెప్తుల్లా విదేశీ పర్యటనలో ఉన్నందున రాజీనామా చేయలేక పోయారు. అయితే మోదీ కోరినట్టుగా కేబినెట్ నుంచి తప్పుకోవడానికి అంగీకరించారు. అలాగే 65సంవత్సరాల సిద్దేశరను కూడా రాజీనామా చేయాలని కోరినప్పటికీ అందుకాయన కొంత వ్యవధి అడిగారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే వీరిద్దరూ తమ రాజీనామాలను సమర్పించారు. కాగా, మారిన పరిస్థితుల నేపథ్యంలో బాబుల్ సిప్రియోను పట్టణ అభివృద్ధి, గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన సహాయ మంత్రి పదవి నుంచి తప్పించి భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల సహాయ మంత్రిగా నియమించారు. కాగా, వయసు కారణంగా నజ్మా హెప్తుల్లా తన పదవికి రాజీనామా చేసినప్పటికీ కల్‌రాజ్ మిశ్రా మాత్రం రాజీనామా చేయలేదు.