అంతర్జాతీయం

చైనాకు ఎదురు దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ది హేగ్/బీజింగ్, జూలై 12: దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి చారిత్రక హక్కులు లేవని అంతర్జాతీయ వివాదాల ట్రిబ్యునల్ మంగళవారం తీర్పు చెప్పింది. దక్షిణ చైనా సముద్రంలో దాదాపు 90 శాతంపై తమదేనని వాదిస్తూ వస్తున్న చైనాకు ఈ తీర్పు పెద్ద ఎదురు దెబ్బగానే భావించవచ్చు. అయితే ఈ తీర్పు వెలువడిన కొద్ది నిమిషాలకే అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పును తాము ఎట్టి పరిస్తితుల్లోను, గుర్తించబోమని, అంగీకరించబోమంటూ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.
దక్షిణ చైనా సమద్రంపై చైనా పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ ఫిలిప్పీన్స్ 2013లో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనికి దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలయిన వియత్నాం, బ్రూనీ, తైవాన్, ఇండోనేసియా తదితర దేశాలు కూడా మద్దతు తెలిపాయి. దక్షిణ చైనా సముద్రంలోని 90 శాతం ప్రాంతంపై తమకే హక్కులున్నట్లు చైనా చేస్తున్న వాదనకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని మలేసియా అభ్యర్థన మేరకు అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పాటు చేసిన అయిదుగురు జడ్జీల ట్రిబ్యునల్ సుదీర్ఘ తీర్పులో స్పష్టం చేసింది.
కాగా,ట్రిబ్యునల్ తీర్పును చైనా ప్రభుత్వం అంగీకరించబోదని, అలాగే గుర్తించదని చైనా విదేశాంగ శాఖ ఈ తీర్పు వెలువడిన కొద్ది సేపటికే విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. దక్షిణ చైనా సముద్రం ప్రాంత భూభాగాలపై చైనా హక్కులు, ప్రయోజనాలపై ఈ తీర్పులు ఎలాంటి ప్రభావాన్ని చూపించబోవని ఆ ప్రకటన స్పష్టం చేసినట్లు చైనా అధికార వార్తాసంస్థ ‘జిన్హువా’ తెలిపింది.
దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనాతో పాటుగా ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేసియా, బ్రూనీ, తైవాన్ తదితర దేశాలున్నాయి. ఇవే కాకుండా కొన్ని వందల దీవులు కూడా ఉన్నాయి. ఈ దీవుల ప్రాంతంలో అపారమైన చమురు, సహజవాయువు, ఖనిజ నిక్షేపాలు, మత్స్య సంపద ఉండడంతో ఆయా దేశాలు ఆ దీవులను ఆక్రమించుకుని ఆర్థిక ప్రయోజనాలు సాధించుకునే దిశగా అడుగులేయడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో దేశాల మధ్య వివాదాలు తలెత్తకుండా చూడడానికి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సముద్ర జలాల ఒప్పందం తీసుకు వచ్చింది.
అయితే 1940 నాటి మ్యాపుల ఆధారంగా ఆ దీవుల్లో చాలా వాటిపై అధికారం తమదేనని చైనా వాదిస్తుండడంతో ఆ ప్రాంత దేశాల మధ్య వివాదాలు మొదలైనాయి. ఈ నేపథ్యంలో మలేసియా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆక్రమించింది.