జాతీయ వార్తలు

‘కాశ్మీర్’పై రేపు పాక్ ప్రత్యేక కేబినెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 13: కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిని చర్చించడానికి శుక్రవారం నాడు ప్రత్యేక కేబినెట్ సమావేశం నిర్వహించాలని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ నిర్ణయించారు. కాశ్మీర్‌లో దిగజారుతున్న పరిస్థితిని చర్చించడానికి తదుపరి ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్నదానిపై కూడా ఆ సమావేశంలో చర్చిస్తారు. అమాయక పౌరులపైన భారత భద్రతా దళాలు చేపడుతున్న అణచివేత చర్యలను పాకిస్తాన్ కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని, బుర్హన్ వనీ హతుడైన తర్వాత నెలకొన్న పరిస్థితిని కూడా సమీక్షిస్తామని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నవాజ్ ఆదేశాల మేరకు భారత హైకమిషనర్‌ను పిలిపించిన పాక్ విదేశాంగ కార్యాలయం కాశ్మీర్ పరిస్థితి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ మానవ హక్కులకు విలువ లేదని, భద్రతా దళాల అణచివేత చర్యలు పేట్రేగిపోతున్నాయని తెలిపింది.
మళ్లీ విషం కక్కిన సరుూద్
లాహోర్: పాక్ కేంద్రంగా పనిచేస్తున్న తీవ్రవాద సంస్థ జమాతే ఉల్ దవా అధినేత హఫీజ్ సరుూద్ బుధవారం భారత్‌పై మరింతగా రెచ్చిపోయాడు. కాశ్మీర్‌లో భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హన్ వనీ ఆత్మశాంతి కోసం ప్రార్థనలు జరిపిన హఫీజ్ భారత్‌పై జిహాద్‌కు ముస్లింలందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చాడు. లాహోర్‌లో జరిగిన ఈ ప్రార్థనా సమావేశంలో తన మద్దతుదారునుద్దేశించి మాట్లాడాడు. ఆ సందర్భంగా ఆ ప్రాంతమంతా భారత వ్యతిరేక నినాదాలతో మారుమోగింది. భారత్‌నుంచి కాశ్మీర్‌కు విముక్తి కల్పించడానికి ముస్లింలంతా ఏకం కావాలని పిలుపునిచ్చిన హఫీ జ్ హిజ్బుల్ కమాండర్ మరణాన్ని త్యాగంగా అభివర్ణించాడు.
కిరోసిన్‌పై లీటర్‌కు
25పైసలు పెంపు
న్యూఢిల్లీ, జూలై 13: ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు కిరోసిన్‌పై సబ్సిడీ భారం తగ్గించుకునే వెసులుబాటును కల్పించారు. కిరోసిన్‌పై లీటర్‌కు నెలకు 25 పైసలు చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. లీటర్‌కు నెలకు 25 పైసలు చొప్పున పది నెలలపాటు పెంచుకోవచ్చని ఓ అధికార ప్రకటనలో తెలిపారు.‘ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అభ్యర్థనకు పెట్రోలియం మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. 2017 ఏప్రిల్ వరకూ ప్రతి నెలా లీటర్‌కు 25 పైసల చొప్పున పెంచుకునేందుకు వీలుకల్పించింది’అని సీనియర్ అధికారి వెల్లడించారు. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ కిరోసిన్ ధర 14.96 పైసలు. 2011లో లీటర్‌కు 2 రూపాయల 64పైసలు పెంచారు.
మహారాష్టల్రో ఎంఐఎం గుర్తింపు రద్దు
ముంబయి, జూలై 13: ఎన్నికల వ్యయానికి సంబంధించి వివరాలు అందించనందుకు 191 రాజకీయ పార్టీల గుర్తింపును మహారాష్ట్ర ఎన్నికల సంఘం రద్దుచేసింది. గుర్తింపురద్దయిన పార్టీల్లో ఏఐఎంఐఎం కూడా ఉంది. అలాగే ఆర్‌పిఐ (ఖోబ్రగడే) పార్టీపైనా అనర్హత వేటుపడింది. 191 పార్టీలు ఐటి రిటర్న్స్ దాఖలు చేయనందుకు ఈ చర్య తీసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి జెఎస్ సహారియా వెల్లడించారు. ఎఐఎంఐఎంకు మహారాష్ట్ర అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. మొత్తం 359 రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రర్ చేయించుకోగా 17 పార్టీలకు మాత్రమే గుర్తింపులభించింది. సంబంధిత ధృవీకరణ పత్రాలు అందజేయాల్సిందిగా 326 పార్టీలకు నోటీసులు జారీ చేసినా స్పందించలేదని సహారియా తెలిపారు. కొన్ని పార్టీల అభ్యర్థన మేరకు గడువుపొడిగించినప్పటికీ ధృవీకరణ పత్రాలు అందజేయలేదని ఆయన స్పష్టం చేశారు.‘ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న పార్టీలు ఇసి వద్ద నమోదు చేయించుకోవాలి’అని ఆయన విజ్ఞప్తి చేశారు.