జాతీయ వార్తలు

సుప్రీం తీర్పు వింతగా ఉంది: బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: అరుణాచల్‌ప్రదేశ్‌లో మెజారిటీ మద్దతు ఉన్న నేతను ప్రతిపక్షంలో కూర్చోవాలంటూ మెజారిటీ మద్దతు ఉన్న నేతను ప్రతిపక్షంలో కూర్చోవాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా వింతగా ఉందని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. అంతేకాదు ఈ తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలహీన పరుస్తుందా లేక బలోపేతం చేస్తుందా అన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం చాలా ముఖ్యమైందని ఆ పార్టీ అంటూ, ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన సంఖ్యాబలం ప్రస్తుత ముఖ్యమంత్రి కలిఖో పుల్‌కే ఉంది తప్ప ఆయనకన్నా ముందు సిఎంగా ఉండిన నబమ్ తుకికి కాదని కూడా అభిప్రాయ పడింది. ‘ఈ ఏడు నెలల కాలంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి . ఈ తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందా లేక బలహీనం చేస్తుందా అనే అనుమానాన్ని తప్పకుండా రేకెత్తిస్తుంది. అంతేకాదు మెజారిటీ ఉన్న వ్యక్తిని ప్రతిపక్షంలో కూర్చోమని, మెజారిటీ కోల్పోయిన వ్యక్తిని ప్రభుత్వాన్ని నడపమని కోరుతున్నట్లుగా కూడా ఈ తీర్పు ఉంది’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ శర్మ విలేఖరులతో అన్నారు. అయితే సుప్రీం తీర్పుపై తాను వ్యాఖ్యానించడం లేదని, తీర్పును పరిశీలించిన తర్వాత పార్టీ దానిపై వ్యాఖ్యానిస్తుందని ఆయన స్పష్టం చేశారు.