జాతీయ వార్తలు

ఇప్పట్లో భారత్‌కు రాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 15: భారత్‌కు ఇప్పట్లో తిరిగివచ్చే ఆలోచన లేదని వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ తేల్చిచెప్పేశారు. తన ప్రసంగాల ద్వారా యువతను ముఖ్యంగా ముస్లింలను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్‌‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా నేనెప్పుడూ ప్రోత్సహించలేదు. దానికి పురిగొల్పనూ లేదు. నా ఉపన్యాసాలు కూడా అలా ఉండవు’అని స్పష్టం చేశారు. టెలివిజన్ ప్రసంగాల ద్వారా వేలాది మందిని ప్రభావితం చేసే జకీర్ మూడు సార్లు ప్రెస్‌మీట్‌లు ఏర్పాటుచేసినట్టే చేసి రద్దు చేసుకున్నారు. సౌదీ అరేబియాలోఉన్న నాయక్ స్కైప్ ద్వారా మీడియా సమావేశం నిర్వహించానులనుకున్న అధికారుల వత్తిళ్ల వల్ల వేదిక దొరకలేదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా తాను ఎప్పుడూ ప్రసంగించలేదని, ఢాకా దాడితోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. తాను శాంతి దూతనని చెప్పుకున్న జకీర్ ‘అమాయకులను చంపమని ఇస్లాం ఎక్కడా చెప్పలేదు. అలాంటి చర్యలు ఇస్లాంకు పూర్తి విరుద్ధం. ఉగ్రవాద దాడులను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’అని ప్రకటించారు. తనపై మీడియాలో వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని, తనపై అన్యాయంగా ఇవన్నీ సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.తన ప్రసంగాలు ఢాకా దాడులకు ప్రోత్సహించాయన్న విమర్శలను కొట్టిపారేశారు.