జాతీయ వార్తలు

హైకోర్టుపై నిలదీయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. ఆదివారం ఢిల్లీలోని సిఎం నివాసంలో కెసిఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కేంద్రానికి పార్లమెంట్‌లో అంశాలవారీగా మద్దతిస్తూనే రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పార్లమెంట్‌లో లేవనేత్తాలని ఎంపీలకు సూచించారు. ప్రధానంగా హైకోర్టు విభజనతో పాటు, సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు కేంద్ర నిధుల సాయంపై కేంద్రాన్ని పార్లమెంట్‌లో ప్రశ్నించేందుకు తెరాస సిద్ధమవుతోంది. పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం లోక్‌సభా పక్షనేత జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా హైకోర్టు అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామన్నారు. గతంలో మూడు రాష్ట్రాలు విభజన జరిగిన సమయంలో 15 రోజుల్లో హైకోర్టు విభజించారని, కాని తెలంగాణ విషయంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. అయితే హైకోర్టు విభజనపై పార్లమెంట్‌లో చేపట్టాల్సిన ఆందోళన వ్యూహంపై చర్చించలేదన్నారు. ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ జిఎస్టీ బిల్లుకు తెరాస మద్దతిస్తుందని తెలిపారు. సమావేశంలో పార్టీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కొండా విశే్వశ్వరరెడ్డి, బూర నర్సయ్యగౌడ్, సీతారాం నాయక్, బాల్క సుమన్, నగేష్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బిబి పాటిల్, మల్లారెడ్డి, రాజ్యసభ ఎంపీలు డి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతం, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలచారి, రామచంద్రుడు, తేజావత్ పాల్గొన్నారు.
ప్రధాని మోదీతో నేడు కెసిఆర్ భేటీ
ఢిల్లీ పర్యటనలోవున్న సిఎం కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం మధ్యాహ్నం 12.40కు పార్లమెంట్‌లో భేటీకానున్నారు. ఈ సందర్భంగా విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, హైకోర్టు విభజన, కేంద్రనికి రావాల్సిన నిధులు పలు అంశాలపై ప్రధాని మోదీతో సిఎం కెసిఆర్ చర్చిస్తారు.