జాతీయ వార్తలు

ఉత్తర భారతంలో భూప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: గుజరాత్, పంజాబ్, ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం మూడు ఓ మోస్తరు భూప్రకంపనలు సంభవించాయి. ఆదివారం సాయంత్రం 5 గంటల 24 నిమిషాల సమయంలో పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 4.6 పాయింట్ల తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. పాకిస్తాన్, దేశ రాజధాని డిల్లీ సహా ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది. భారత్-పాక్ సరిహద్దు కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం భూమిలోపల 15 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సీసమాలజీ తెలిపింది. ఈ భూకంపం కేంద్రం భారత్‌లోనే ఉందని, అయితే పాక్-్భరత్ సరిహద్దులకు ఆనుకుని ఉందని ఈ కేంద్రం ఆపరేషన్స్ విభాగం అధిపతి జెఎల్ గౌతమ్ తెలిపారు. అయితే ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు వార్తలు రాలేదు. అంతకు ముందు ఉదయం 9 గంటల 25 నిమిషాల సమయంలో గుజరాత్‌లో రిక్టర్ స్కేలుపై 4.5 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించింది. అలాగే ఉదయం 8 గంటల 1 నిమిషం సమయంలో మణిపూర్‌లో 3.2 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించింది.