జాతీయ వార్తలు

రామానుజుల విగ్రహావిష్కరణకు మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: విశిష్టాద్వైత తత్త్వవేత్త, వైష్ణవ భక్తి ఉద్యమసారధి భగవద్రామానుజుల సహస్రాబ్ది సందర్భంగా హైదరాబాద్‌లో నెలకొల్పనున్న ఆయన భారీ పంచలోహ విగ్రహ ఆవిష్కరణకు రావలసిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి ఆహ్వానించారు. ఆదివారం ఆయన ప్రధానిని కలిసారు. రామానుజుల వారి 1000 సంవత్సరాల జయంతి ఉత్సవాలు 2017లో జరగనున్నాయని, ఈ సందర్భంలో 216 అడుగుల ఎతె్తైన పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానితో భేటీ అనంతరం చినజీయర్ స్వామి విలేఖరులకు తెలిపారు. శంషాబాద్‌లో సమతాముక్తి స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సమాజానికి ఇవాళ అవసరమైన దిశానిర్దేశాన్ని వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు ప్రపంచానికి అందించారన్నారు. రామానుజాచార్యులు దళితులను తమతో పాటు ఆలయానికి తీసుకెళ్లి, వారందరికీ దేవుణ్ణి దర్శించుకునే అవకాశం ఇచ్చారన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ, కన్నడ రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే దళితులను లక్ష మందికి సంకల్పం చెప్పి సమతా స్నానం చేయించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. సంస్కారం లేనప్పుడు సకల వేదాలు చదివినా ప్రయోజనం లేదని చినజియర్‌స్వామి చేప్పారు.

హైదరాబాద్‌లో నెలకొల్పనున్న రామానుజుల భారీ పంచలోహ
విగ్రహ ఆవిష్కరణకు రావలసిందిగా నరేంద్రమోదీని ఆహ్వానిస్తున్న
త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి