జాతీయ వార్తలు

తొమ్మిదో రోజు అంతే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 17: హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హన్ వనీ హత్య దరిమిలా తలెత్తిన అల్లర్లు, హింసాకాండ దృష్ట్యా జమ్మూ, కాశ్మీర్‌లో ఆదివారం తొమ్మిదో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగింది. ఈ అల్లర్లలో 39 మంది మరణించగా, 3100 మంది గాయపడిన విషయం తెలిసిందే. శాంతిభద్రతలను కాపాడడానికి ముందుజాగ్రత్త చర్యగా కాశ్మీర్ లోయలోని మొత్తం పది జిల్లాల్లోను ఆదివారం కూడా కర్ఫ్యూ అమలులో ఉందని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. శనివారం కుప్వారా జిల్లాలో తాజాగా చెలరేగిన అల్లర్లలో ఒక వ్యక్తి మృతి చెందిన దృష్ట్యా కర్ఫ్యూను కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆ అధికారి చెప్పారు. నిషేధాజ్ఞలను కఠినంగా అమలుచేయడానికి పోలీసు, పారా మిలటరీ బలగాలను పెద్దసంఖ్యలో మోహరించినట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు కాశ్మీర్ లోయలో పరిస్థితి ప్రశాంతంగానే ఉందని ఆయన తెలిపారు.
ఉత్తర కాశ్మీర్‌లోని మూడు జిల్లాలకు శనివారం అన్ని టెలిఫోన్ సర్వీసులను నిలిపివేయగా, పుకార్లు వ్యాప్తి కాకుండా చూడడానికి కాశ్మీర్ లోయ అంతటా మొబైల్ టెలిఫోన్ సర్వీసులను నిలిపి వేశారు. లోయలోని మిగతా ఏడు జిల్లాల్లో బిఎస్‌ఎన్‌ఎల్ మొబైల్స్ మాత్రమే పని చేస్తున్నాయి. వారం రోజులుగా మొబైల్ ఇంటర్నెట్ సేవలు సైతం ఆగిపోగా, రైలు సర్వీసులను కూడా నిలిపివేశారు. వేర్పాటువాదుల బంద్ పిలుపుతో పాటుగా అధికారులు విధించిన కర్ఫ్యూ ఆంక్షల కారణంగా గత శనివారంనుంచి కాశ్మీర్ లోయలో సాధారణ జన జీవితం స్తంభించిపోయింది,
వార్తాపత్రికలు బంద్
శనివారం అధికారులు పత్రికా కార్యాలయాలపై దాడి చేసి ప్రింట్ అయిన దినపత్రికల కాపీలను స్వాధీనం చేసుకున్నందుకు నిరసనగా దినపత్రికలను ప్రచురించరాదని వాటి యాజమాన్యాలు నిర్ణయించుకోవడంతో ఆదివారం ఇంగ్లీషు, ఉర్దూ దినపత్రికలతో పాటుగా కాశ్మీరీ పత్రికలు సైతం మార్కెట్లోకి రాలేదు. పోలీసుల చర్య తర్వాత ఈ సమస్యను చర్చించడానికి శనివారం ప్రెస్ కాలనీలో దినపత్రికల ఎడిటర్లు, ప్రచురణకర్తలు, యజమానులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. పత్రికా కార్యాలయాలపై దాడి చేయడాన్ని పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమేనంటూ జర్నలిస్టులు నిరసన ర్యాలీ సైతం నిర్వహించారు.