జాతీయ వార్తలు

ఫిరాయింపు చట్టానికి సవరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: పార్టీ ఫిరాయింపుల చట్టంలో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు వైకాపా లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్ అన్నారు. ఆదివారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్షం సమావేశానికి ఆ పార్టీ ఎంపీలు మేకపాటి, విజయ సాయిరెడ్డి హాజరయ్యారు. అనంతరం మేకపాటి విలేఖరులతో మాట్లాడుతూ, ప్రధానంగా మూడు అంశాలను తమ పార్టీ తరపున అఖిలపక్షం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేయాలని, పార్టీ మారిన ప్రజాప్రతినిధి స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే మూడు నెలల్లో సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిరాయించిన ప్రజాప్రతినిధిపై అనర్హాత వేటువేసే అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించి ఎన్నికల సంఘం పరిధిలోకి తీసుకురావాలని కోరామన్నారు. ఈ అంశంపై రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశ పెడతారని వెల్లడించారు. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, హామీలను కేంద్రం అమలు చేయాలని కోరామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ప్రత్యేక రైల్వే జోన్, రాజధాని నిర్మాణానికి ఆర్థిక నిధులు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. నియోజకవర్గాల అభివృద్ధికి ఏంపీ లాడ్స్ నిధులను పెంచాలని కోరామన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదానికి సహకరించాలని ప్రతిపక్షాలను కేంద్రం కోరిందని, ప్రజా ప్రయోజనాలున్న బిల్లులకు వైకాపా మద్దతు ఉంటుందని మేకపాటి స్పష్టం చేశారు.
విభజన హామీలన్నీ అమలు చేయాలి
విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను త్వరితగతిన అమలుచేయాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు టీడీపీ లోక్‌సభపక్ష నేత తోట నర్సింహం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాల నిధుల అంశాలు సమావేశంలో ప్రస్తావించామన్నారు. కేంద్రానికి పార్లమెంట్‌లో తాము సంపూర్ణ సహకారం అందిస్తామని, జీఎస్టీ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని తోట స్పష్టం చేశారు. ఏపీ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా విభజన చేసి, ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ప్రైవేటు బిల్లు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైకోర్టు విభజనను ఏపీ అడ్డుకుంటోందని విమర్శలు చేయడం సరికాదన్నారు.
అఖిలపక్ష సమావేశం అనంతరం వెలుపలకు వస్తున్న వైకాపా ఎంపీలు మేకపాటి రాజమోహన్, విజయసాయ రెడ్డి. చిత్రంలో కేంద్ర మంత్రులు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, అనుప్రియ పటేల్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, గులామ్ నబీ ఆజాద్ తదితరులు