జాతీయ వార్తలు

రాజస్థాన్‌కు హార్దిక్ పటేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, జూలై 17: పటేళ్ల కోటా ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్‌కు గుజరాత్ హైకోర్టు ఆరునెలల రాష్ట్ర బహిష్కరణ శిక్ష విధించడంతో ఆదివారం ఉదయం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు వెళ్లారు. శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు రాష్ట్రం విడిచివెళ్లడానికి 48 గంటల గడువు విధించిన విషయం విదితమే. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఉదయ్‌పూర్‌లోని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, స్థానిక పటేల్ నాయకుడు పుష్కర్‌లాల్ పటేల్ నివాసంలో నివసించనున్నట్లు పటేల్ ఆందోళన్ సమితి నాయకుడు, హార్దిక్ సన్నిహితుడు అయిన దినేష్ బంభానియా వెల్లడించారు. ఉదయం 7.30కు తన స్వగ్రామమైన విరంగం నుంచి బయలుదేరిన హార్దిక్ మధ్యాహ్నానికి ఉదయ్‌పూర్ చేరుకుంటారని ఆయన తెలిపారు. జైలునుంచి విడుదలైన 48 గంటల్లోగా రాష్ట్రాన్ని విడిచిపెట్టాలని హైకోర్టు ఆదేశించడంతో ఆదివారం ఉదయం 11 గంటల్లోగా ఉదయ్‌పూర్ చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయ్‌పూర్‌లో హార్దిక్ నివాసముండే మాజీ ఎమ్మెల్యే పుష్కర్‌లాల్ పటేల్ ఇంటి అడ్రస్ వివరాలను న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. పటేళ్ల హక్కుల కోసం హార్దిక్ పటేల్ పోరాడుతున్నాడని, తన ఇంట్లో నివసించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పుష్కర్‌లాల్ పటేల్ వెల్లడించారు. రాజస్థాన్‌లోనూ హార్దిక్‌కు మద్దతుదారులున్నారని పేర్కొన్నాడు.

ఉదయ్‌పూర్ చేరిన హార్దిక్‌కు స్వాగతం చెబుతున్న స్థానికులు