జాతీయ వార్తలు

షీలాకు తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూలై 17: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలాదీక్షిత్‌కు పెద్దప్రమాదం తప్పింది. ఆదివారం రోడ్‌షోలో భాగంగా ఒక మినీ ట్రక్కుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వేదిక కూలిపోవడంతో స్వల్ప గాయాలతో ఆమె బైటపడ్డారు. లక్నోలోని అవౌసి విమానాశ్రయంనుంచి మాల్ అవెన్యూలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి రోడ్‌షోగా వెళుతున్నప్పుడు మినీ ట్రక్కుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్లాట్‌ఫామ్‌లో షీలాదీక్షిత్ నిలబడి ఉన్న చెక్క పలక కూలిపోయింది. దీంతో ఆమె ఒక్కసారిగా కూలబడిపోయారు. వేదికపై ఉన్న మిగతావాళ్లు ఆమెకు చేయి అందించి పైకి లేపారు. తర్వాత ఆమెను పక్కన ఉన్న ఒక కారులోకి మార్చినట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడొకరు చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ అధికారికంగా ప్రకటించిన తర్వాత షీలా దీక్షిత్ లక్నో రావడం ఇదే మొదటిసారి.

కూలిక వేదిక నుంచి స్వల్ప గాయాలతో బయటకు వస్తున్న షీలా దీక్షిత్