జాతీయ వార్తలు

ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ప్రతిరోజు మాదిరిగానే మంగళవారం కూడా లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో గొడవచేసిన అనంతరం జీరో అవర్‌లో కొద్దిసేపు నినాదాలిచ్చి సభనుండి వాకౌట్ చేశారు. అనంతరం లోక్‌సభ సాయంత్రం వరకు ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే పంజాబ్‌లో దళితులపై జరిగిన దాడి గురించి చర్చించేందుకు కాంగ్రెస్ సీనియన్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా, సంతోక్‌సింగ్ చౌదరి, జై ప్రకాశ్ నారాయణ్ యాదవ్, కె.సి.వేణుగోపాల్, పి.కరుణాకరన్, రంజీత్ రంజన్, ఎన్.కె.ప్రేమచంద్రన్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. వాయిదా తీర్మానాలు ప్రతిపాదించిన వారికి జీరో అవర్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని ప్రకటించిన అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు మాత్రం వాయిదా తీర్మానాలపై ఇప్పుడే చర్చ జరపాలంటూ గొడవ చేశారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నంత సేపు కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్ద నిలబడి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఎన్‌డిఏ ప్రభుత్వం, పంజాబ్‌లో అకాలీదళ్-బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఈ గొడవ మధ్యలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, జ్యోతిరాదిత్య సింధియా లేచి వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టకపోవటం అన్యాయమని ఆరోపించారు. జీరో అవర్‌లో మొదట జ్యోతిరాదిత్య సింధియాకు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. సింధియా పంజాబ్‌లో దళితుల చేతులు నరికివేయటం గురించి ప్రస్తావిస్తూ బిజెపి, దాని మిత్రపక్షాలు దళిత వ్యతిరేకులని ఆరోపించారు. దీనిని అధికార పక్షం సభ్యులు ఖండించారు. అకాలీదళ్ సభ్యులు ఆగ్రహంతో లేచి కాంగ్రెస్‌పై ఆరోపణలు కురిపించారు. ఇది దళిత వ్యతిరేక, మహిళా వ్యతిరేక ప్రభుత్వమని జ్యోతిరాదిత్య సింధియా పలుమార్లు ఆరోపించారు. ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చిన తరువాత గత పద్దెనిమిది నెలల్లో దళితులు, మహిళలపై ఎన్నో దాడులు జరిగాయని చెప్పారు. పంజాబ్‌లో దాడులకు బాధ్యులైనవారు ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్‌కు బంధువులు, సన్నిహితులని సింధియా ఆరోపించటంతో సభలో మరోసారి గందరగోళం నెలకొంది. ఇరుపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ దశలో మల్లికార్జున ఖర్గే లేచి ఎన్‌డిఏ ప్రభుత్వం దళిత, మహిళా వ్యతిరేక విధానాలకు నిరసనగా తమ పార్టీ సభనుండి వాకౌట్ చేస్తోందని ప్రకటించారు. దీనితో కాంగ్రెస్ సభ్యులంతా సభ నుండి బైటికి వెళ్లిపోయారు. వెంటనే తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు కూడా సభనుండి వాకౌట్ చేశారు.
కౌర్ ఖండన
పంజాబ్‌లో దళితులకు రక్షణ లేకుండా పోయిందంటూ జ్యోతిరాదిత్య సంధియా చేసిన ఆరోపణలను అకాలీదళ్ నాయకురాలు, కేంద్ర పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తీవ్రంగా ఖండించారు. దళితులు, జాట్ వర్గాల మధ్య జరిగిన కొట్లాటల్లో ఒక దళితుడి చేతులను నరికివేశారు, ఇది కేవలం ముఠా తగాదాల సంఘటన తప్ప మరేమీ కాదని ఆమె స్పష్టం చేశారు. వాస్తవానికి కేంద్రంలో యుపిఏ అధికారంలో ఉన్నప్పుడే దళితులు, మహిళలపై ఎక్కువ దాడులు జరిగాయని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ చివరకు దళితులను సైతం తమ రాజకీయానికి వాడుకుంటోందని కౌర్ దుయ్యబట్టారు.

లోక్‌సభలో మాట్లాడుతున్న హర్‌సిమ్రత్ కౌర్