జాతీయ వార్తలు

గట్టు వద్ద సౌర విద్యుత్ పార్క్‌కు కేంద్రం అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: మహబూబ్‌నగర్ జిల్లా గట్టువద్ద ఐదు వందల మెగావాట్ల సౌర విద్యుత్ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని కేంద్ర ఇంధన, బొగ్గు, పునరుత్పత్తి ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్ రాష్ట్ర కాంగ్రెస్ ఎం.పి నంది ఎల్లయ్యకు రాసిన లేఖలో తెలిపారు. గట్టు వద్ద సౌర విద్యుత్ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమిని కేటాయించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరటం జరిగిందనీ, భూమి కేటాయించగానే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని గోయల్ తమ లేఖలో వివరించారు. సౌర విద్యుత్ పార్క్‌కు టిఎన్‌ఆర్‌ఇడిసి అభివృద్ధికర్తగా గుర్తించినట్లు ఆయన నంది ఎల్లయ్యకు రాసిన లేఖలో తెలిపారు. ఎన్‌టిపిసి తదితర సంస్థలు సౌర విద్యుత్ పార్క్‌లో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాయని గోయల్ తెలిపారు.

తిరంగ యాత్రకు
బిజెపి సన్నాహాలు
పార్లమెంటరీ పార్టీ
సమావేశంలో చర్చ
న్యూఢిల్లీ, జూలై 19: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఈసారి ఘ నంగా నిర్వహించాలని, ఉత్సవాల్లో భాగంగా వారం పాటు దేశ వ్యాప్తంగా తిరంగ యాత్రలు చేపట్టాలని కేంద్రంలోని అధికార బిజెపి నిర్ణయించింది. పేదలకు అనుకూలంగా చేపట్టిన విధానాలను, అలాగే జాతీయ అజెండానూ విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలని భావిస్తోంది. మంగళవారం ఇక్కడ జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తిరంగ యాత్ర సహా అనేక అంశాలపై చర్చించారు. 70యవ స్వాతంత్య్ర వేడుకలు అత్యంత ఘనంగా, ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్న కేంద్రం ఇందుకు సంబంధించి కొన్ని వౌలిక అంశాలపై నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15-22 తేదీల మధ్య బిజెపి కార్యకర్తలు తిరంగ యాత్ర నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.