జాతీయ వార్తలు

ఢిల్లీలో కెటిఆర్ బిజీబిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: తెలంగాణలో ఐటీ, హార్డ్‌వేర్ రంగాలకు పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు ఢిల్లీలో మంగళవారం పలు దేశాల రాయబారులతో చర్చలు జరిపారు. కె.టి.రామారావు జపాన్, తైవాన్, దక్షిణ కొరియా దేశాల ప్రతినిధులతో పాటు కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖమంత్రి కల్‌రాజ్ మిశ్రా, హడ్కో సీఎండి, గృహనిర్మాణ బోర్డు డైరెక్టర్ జనరల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పారిశ్రామిక విధానాన్ని వివరించడంతో పాటు, తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశలను పరిస్థితులను వారికి వివరించారు.
అనంతరం మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను వివరించానని తెలిపారు. జపాన్ రాయబారితో మన దేశంలో కంప్యూటర్ హార్డ్‌వేర్‌తో పాటు ఎలక్ట్రానిక్ ఉత్పత్తి పరిశ్రమలను స్థాపించడానికి అసక్తి చూపుతున్న క్రమంలో తెలంగాణను ఎంచుకోవడం ప్రయోజనం కలుగుతుందని వివరించినట్లు చెప్పారు. ‘మేక్ ఇన్ తెలంగాణ’లో భాగంగా ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం కోసం జపాన్ డిప్యూటి రాయబారితో సమావేశమయ్యామనీ, వచ్చే నెలలో జపాన్‌లో పర్యటించనున్నట్లు కెటిఆర్ చెప్పారు. మలేషియా డిప్యూటీ ప్రధాని అహ్మద్ జహీత్ జరిగిన సమావేశం గురించి వివరిస్తూ ఆయన నేతృత్వంలో ఆ దేశ పారిశ్రామికవేత్తల బృందం హైదరాబాద్‌లో వచ్చే నెలలో పర్యటించనుందని వివరించారు.తెలంగాణలో నెలకొల్పనున్న డాటాబేస్ క్యాంపస్‌లో తగిన సాంకేతిక సహకారాన్ని అందించేందుకు భారతి ఎయిర్‌టెల్ వ్యవస్థాపక చైర్మన్ సునీల్ మిట్టల్ సానుకులంగా స్పందించారని కెటిఆర్ చెప్పారు. ఫార్మాసిటీ భూసేకరణకు అవసరమయ్యే రూ.745 కోట్ల రుణం మంజూరుకు హడ్కో చైర్మన్ రవికాంత్ సానుకులంగా స్పందించారని కెటిఆర్ పేర్కొన్నారు.