జాతీయ వార్తలు

సిఆర్‌పిఎఫ్ కమాండోల మృతికి నితీశ్ సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూలై 19: బిహార్‌లోని గయ, ఔరంగాబాద్ జిల్లాల సరిహద్దుల్లో సోమవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో పదిమంది సిఆర్‌పిఎఫ్ కమాండోలు మృతి చెందడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు నష్టపరిహారాన్ని ప్రకటించారు. చాకర్‌బంద- దుమరినాలా అటవీ ప్రాంతం వద్ద నక్సల్స్ పేల్చిన మందుపాతరకు కోబ్రా యూనిట్‌కు చెందిన పదిమంది సిఆర్‌పిఎఫ్ కమాండోలు చనిపోవడం తెలిసిందే. ఎనిమిది మంది కమాండోలు సంఘటన స్థలంలోనే చనిపోగా, మరో ఇద్దరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. పరిస్థితిని స్వయంగా అంచనా వేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి తక్షణమై గయ జిల్లాకు వెళ్లాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజనీ కుమార్ సింగ్, రాష్ట్ర పోలీసు చీఫ్ పికె ఠాకూర్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి అమీర్ సుభానీలను ఆదేశించినట్లు ఒక అధికార ప్రకటన తెలిపింది. ఆయన ఈ సంఘటనపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కూడా మాట్లాడినట్లు ఆ ప్రకటన తెలిపింది. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ సాయం కింద తలా 5 లక్షల రూపాయలు విడుదల చేయాలని హోం శాఖను సిఎం ఆదేశించారు. అంతేకాకుండా నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో అమలులో ఉన్న ప్రత్యేక పథకం కింద చనిపోయిన జవాన్ల కుటుంబాలకు తలా 20లక్షల సాయం అందజేయాలని కూడా ఆదేశించారు. గాయపడిన వారికి అవసరమైన అన్ని రకాల వైద్య సహాయాన్ని అందించాలని కూడా నితీశ్ అధికారులను ఆదేశించారు.