జాతీయ వార్తలు

వార్తా పత్రికలపై నిషేధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: కాశ్మీర్ లోయలో మీడియాపై ప్రభుత్వం దాడులు చేస్తోందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కాశ్మీర్‌లో వార్తాపత్రికల ప్రచురణలపై ఎలాంటి నిషేధం లేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయడు సోమవారం రాత్రి జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి ఫోన్ చేసి ఈ విషయంపై వివరాలు అడిగారు. ‘కాశ్మీర్ లోయలో దినపత్రికల ప్రచురణపై ఎలాంటి నిషేధం లేదని ముఖ్యమంత్రి కేంద్రమంత్రికి వివరణ ఇచ్చారు’ అని సమాచార ప్రసారాల శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ప్రభుత్వం మీడియాపై దాడులు చేయడంతో గత 12 రోజులుగా నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతున్న కాశ్మీర్ లోయలో గత మూడు రోజులుగా దినపత్రికలు మార్కెట్లోకి రాలేదు. నగర శివార్లలోని రంగ్రేత్ పారిశ్రామికవాడలో ఉన్న రెండు దినపత్రికల ప్రింటింగ్ ప్రెస్‌లపై గత శుక్రవారం పోలీసులు దాడి చేసి దినపత్రికల ప్లేట్లను, ప్రింట్ అయిన కాపీలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కాశ్మీర్ లోయలో వార్తాపత్రికల ప్రచురణలను నిషేధించాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి ఆమోదముద్ర లేదని, బహుశా లోకల్ స్థాయిలో అధికారులు ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని సోమవారం ముఖ్యమంత్రి మెహబూబా సలహాదారు అమితాబ్ మట్టూ చెప్తూ, ఇందుకు బాధ్యలైన వారిపై చర్య తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

మీడియాపై ఆంక్షలు విధించినందుకు నిరసనగా మంగళవారం శ్రీనగర్‌లో
నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న జర్నలిస్టులు