జాతీయ వార్తలు

కెవిపి బిల్లుకు మద్దతివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం, బిజెపి, వైకాపాలకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు, మాజీ ఎంపీ జెడి శీలం మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రప్రదేశ్‌కు వెనె్నముక లాంటిదని అభిప్రాయపడ్డారు. అది చారిత్రక అవసరం కూడానని వారు పేర్కొన్నారు. రాజ్యసభలో ఈ నెల 22న కెవిపి ప్రతిపాదించిన ప్రత్యేక హోదా ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ జరపవలసి ఉంది. రామచందర్‌రావు ప్రతిపాదించిన ఈ బిల్లుపై గత సమావేశాల్లోనే చర్చ పూర్తికావటంతోపాటు ఓటింగ్ జరిపే సమయంలో కోరం లేకపోవడంతో వాయిదా పడింది. ఈ బిల్లే శుక్రవారం రాజ్యసభ ముందుకు రాబోతోంది. కెవిపి ప్రతిపాదించిన బిల్లుకు మద్దతు ఇవ్వడం చారిత్రక అవసరమనేది టిడిపి, బిజెపి, వైకాపా గుర్తించాలని వారన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు సంపాదించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే వామపక్షాలు, జెడియు, ఆర్‌జెడి, ఎన్‌సిపి, సమాజ్‌వాదీల నాయకులతో చర్చలు జరిపి మద్దతు సంపాదించారన్నారు. ఈ ఆరు పార్టీలు ప్రత్యేక హోదా బిల్లుకు మద్దతు ఇస్తున్నాయని రఘువీరారెడ్డి విలేఖరులకు చెప్పారు. కెవిపి బిల్లుకు మద్దతు ఇస్తారా లేదా అనేది టిడిపి ఎందుకు స్పష్టంగా చెప్పటం లేదని ఆయన ప్రశ్నించారు. ఏపికి ప్రత్యేక హోదా సంపాదించేందుకు కాంగ్రెస్ పలు ఉద్యమాలు నిర్వహించిందని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు చట్టంలో పెట్టవలసిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ప్రధాని పార్లమెంటు వేదికపై నుంచి ఇచ్చిన హామీని అమలు చేయకపోవటం ఇదే మొదటిసారి అని రఘువీరారెడ్డి దుయ్యబట్టారు. తన బిల్లుకు మద్దతు ఇవ్వటం ద్వారా ఏపి ప్రయోజనాలను కాపాడాలని రామచందర్‌రావు బిజెపి, టిడిపి, వైకాపాకు విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో రఘువీరా, కెవిపి, జెడిశీలం