అంతర్జాతీయం

‘సాగర్‌మాల’కు అమెరికా సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిలస్, జూలై 19: భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగర్‌మాల కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో సహకరించటానికి అమెరికా అంగీకరించింది. భారత్‌లోని ఓడరేవుల అభివృద్ధికి సమగ్రమైన సహకారాన్ని అందించేందుకు ఇరుదేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. భారత రహదారులు, ఓడరేవులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అమెరికా అధికారులతో సమావేశమై ఈ దిశగా ఫలవంతమైన చర్చలు జరిపారు. జవహర్‌లాల్ నెహ్రూ ఓడరేవులో కంటయినర్ల నిర్వహణకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, వాణిజ్యానికి సంబంధించి జాయింట్ వెంచర్ అవకాశాలపై చర్చించారు. లాంగ్‌బీచ్ ఓడరేవులో అధికారులతో చర్చలు జరిపిన గడ్కరీ భారతదేశంలో కొత్త ఓడరేవుల నిర్మాణం, అభివృద్ధి, తీరప్రాంత ఆర్థిక మండళ్ల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న రేవుల్లో కొత్త టెర్మినళ్ల నిర్మాణం, ఓడల తయారీ, మరమ్మతులు వంటి అంశాలలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అమెరికా పెట్టుబడిదారులను ఆహ్వానించారు. సాగర్‌మాల ప్రాజెక్టులో 150 ప్రాజెక్టులు ఉన్నాయని, వీటిలో 50నుంచి 60 బిలియన్ డాలర్ల వౌలిక రంగంలో పెట్టుబడులకు అవకాశాలున్నాయని అన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మరో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులకు అవకాశాలున్నాయని ఆయన ఇనె్వస్టర్లను ఆహ్వానించారు.