జాతీయ వార్తలు

తిరుమలపై నో ఫ్లైజోన్ సాధ్యం కాదు: కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: తిరుమల శ్రీనివాసుడి ఆలయ పరిసరాలను ‘నో ఫ్లైజోన్’గా ప్రకటించటం కుదరదని పౌర విమానయాన శాఖ మంగళవారం స్పష్టం చేసింది. దీనివల్ల తిరుపతి విమానాశ్రయం రాకపోకలు తగ్గిపోతాయని పేర్కొంది. వేంకటేశ్వరుడి ఆలయ ప్రాంగణంపై ఆకాశంలో విమానాలు తిరగకుండా నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసింది. దీనిపై ఆ శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ‘తిరుపతి విమానాశ్రయంలో విమానాల రాకపోకలను ఒక్క రన్‌వేకే పరిమితం చేశాం. తిరుమలపై నో ఫ్లైజోన్ ప్రకటించటం వల్ల, ఈ విమానాశ్రయంలో మరింతగా ఆపరేషన్లను కుదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల తిరుమలను నో ఫ్లైజోన్‌గా ప్రకటించటం కుదరదు’ అని ఆయన స్పష్టం చేశారు.