జాతీయ వార్తలు

లెక్క చెప్పని అభ్యర్థులే ఎక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: దేశంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధికులు తాము ఎన్నికల్లో చేసిన వ్యయానికి సంబంధించిన లెక్కలు చూపడం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్టవేసి, స్వేచ్ఛగా ఎన్నికలు జరపడం క్లిష్టంగా మారిందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీమ్ జైదీ అన్నారు. ఎన్నికల్లో ధనమే ప్రధాన పాత్ర పోషిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు ఎంతో ఖర్చుతో కూడుకున్నాయని, ప్రజలకు సేవ చేద్దామని భావించే సగటు వ్యక్తి ఎన్నికల్లో నిలబడాలన్నది ఓ కలగా మారిపోయిందని జైదీ పేర్కొన్నారు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో ప్రచారానికి ప్రభుత్వం నిధులు సమకూర్చడం సాధ్యంకాదని ఇసి స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో విప్లవాత్మకమైన మార్పులు రావల్సిన అవసరం ఉందని కమిషన్ పేర్కొంది. నేర రహిత రాజకీయాలు, అభ్యర్థి ఖర్చుచేసే నిధులు పారదర్శకత ఉండేలా బలమైన చట్టాలు తీసుకురావాల్సి ఉందని ఇసి తెలిపింది. ‘ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వమే నిధులు సమకూర్చాలని అనేక పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం. పార్టీలకు ప్రయోజనం చేకూర్చే కొన్ని నిర్ణయాలు మాత్రం తీసుకోమని చెప్పగలం. ఓటర్ల జాబితాలు అందజేయడం, ప్రభుత్వ ప్రసార మాద్యమాలైన రేడియో, టివిల్లో ప్రచారం చేసుకోవడానికి సమయం కేటాయించడం, పన్ను మినహాయింపు (పార్టీలకు) ఇవ్వగలం’ అని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావల్సి ఉందని ఇసి నొక్కిచెప్పింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలు నేరరహితంగా ఉండాలని, ఆర్థిక పరమైన విషయాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని తెలిపారు. ఎన్నికల వ్యయానికి సంబంధించి సమగ్రమైన ఆడిట్ విధానం, అవినీతి నిరోధక చట్టాలు పటిష్టంగా తయారు చేయాల్సిన అవసరం ఉందని జైదీ ఉద్ఘాటించారు. రాజకీయాలపై ధన ప్రభావం అన్న అంశంపై మంగళవారం ఇక్కడ జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ నిధులు వెచ్చిస్తే వాటిని అజమాయిషీ చేయడానికి పటిష్టమైన యంత్రాంగం అవసరమని ఆయన చెప్పారు. ధన ప్రభావం లేని రాజకీయాలు తీసుకురావడానికి ప్రభుత్వం, రాజకీయ పార్టీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వీటికి రాజకీయ పార్టీలే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలు, సంస్థలు భాగస్వామ్యం లేకుండా ఎన్నికల కమిషన్ ఒక్కటే ఈ సవాళ్లను ఎదుర్కొనలేదని పేర్కొన్నారు.