జాతీయ వార్తలు

మరణించిన అధికారినీ బదిలీ చేసేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 20: ఆ అధికారి చనిపోయి మూడేళ్లయింది. అయితేనేం ఆయనకు తాజాగా బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ వింత మహారాష్టల్రో చోటుచేసుకుంది. ఎక్సైజ్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సందీప్ సబాలే 2013 జూలైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అయితే ఆయన చనిపోయిన విషయం ఆఫీసు రికార్డుల్లో నమోదు కాకపోవడంతో ఈ నెల మొదట్లో జరిగిన 181మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీల్లో ఆయన పేరుకూడా చేరిపోయింది. కొల్హాపూర్ జిల్లాలోని దౌలత్ కోఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీనుంచి సతానాలోని ఎక్సైజ్ ఫ్లైయింగ్ స్క్వాడ్‌కు సందీప్‌ను బదిలీచేస్తూ ఈ నెల 7న ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వులు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణే అసెంబ్లీలో ప్రస్తావించడంతో సిఎంఓ తప్పిదం వెలుగుచూసింది. జరిగిన తప్పిదానికి ఫడ్నవిస్ ప్రభుత్వం, సిఎంఓ బాధ్యత వహించాలన్నారు. గత రెండు వారాల్లో జరిగిన బదిలీలు, ప్రమోషన్లలో భారీఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. కాగా, జరిగిన తప్పిదానికి ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఓ క్లర్క్‌ను సస్పెండ్ చేయడంతో పాటు సందీప్ మరణాన్ని ఆఫీసు రికార్డుల్లో నమోదు చేయనందుకు సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు జారీచేశారు.