జాతీయ వార్తలు

మోదీ పిరికిపంద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఢిల్లీ సచివాలయంపై మంగళవారం సిబిఐ సోదాలు చేయడం పట్ల అటు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ సోదాల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ హస్తముందని కేజ్రివాల్ ఆరోపిస్తూ ఆయన ఒక పిరికిపంద, సైకో అని మండిపడ్డారు. కాగా, ఈ రోజు స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఒక బ్లాక్‌డే అని, ఢిల్లీలో అప్రకటిత ఎమర్జెన్సీని విధించారని ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. అంతేకాదు దమ్ముంటే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలుంటే చూపించాలని ఆ పార్టీ ప్రధానికి బహిరంగ సవాలు విసురుతూ, సిబిఐ సోదాల లక్ష్యం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి రాజేందర్ కుమార్ కాదని, కేజ్రీవాలేనని ఆరోపించింది. ప్రధాని మోదీ రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఈ పిరికిపంద చర్యకు పాల్పడ్డారని కేజ్రీవాల్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ‘మోదీ ప్రభుత్వం ఢిల్లీలో అప్రకటిత ఎమర్జెన్సీని విధించింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి కార్యాలయంపై దాడి జరగలేదు. ఇది భారత దేశ ప్రజాస్వామ్యానికే బ్లాక్ డే’ అని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి రాఘవ్ చద్దా అన్నారు. అయితే ఢిల్లీ సచివాలయంలోని రాజేందర్ కుమార్ కార్యాలయంలో సోదాలు జరిపామే తప్పితే ముఖ్యమంత్రి కార్యాలయంలో కాదని సిబిఐ చెప్తోంది. అయితే సిబిఐ అబద్ధాలు చెప్తోందని, ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఫైళ్లను కూడా చూడడం జరిగిందని కేజ్రీవాల్ అన్నారు. అవినీతి ఆరోపణలపై తానే స్వయంగా ఒక మంత్రిని, సీనియర్ అధికారిని తొలగించి వారి కేసులను సిబిఐకి అప్పగించానని ఆయన చెప్తూ, ఒక వేళ రాజేందర్ కుమార్‌పై సిబిఐకి ఏవయినా సాక్ష్యాలుంటే అవి తనకు చూపించి ఉంటే తానే స్వయంగా ఆయనపై చర్య తీసుకుని ఉండేవాడినని కూడా కేజ్రీవాల్ అన్నారు. ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదయినా సాక్ష్యాన్ని తవ్వి చూపించాలని ఉపముఖ్యమంత్రి మనీష్ శిశోడియా మోదీ ప్రభుత్వాన్ని సవాలు చేసారు. అయితే తమ సోదాలతో కేజ్రీవాల్‌కు కానీ, ఆయన పదవీ కాలానికి కానీ ఎలాంటి సంబంధం లేదని, గతంలో రాజేందర్ కుమార్‌కు వ్యతిరేకంగా వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి మాత్రమే సోదాలు జరిపామని సిబిఐ వాదిస్తోంది.