జాతీయ వార్తలు

ఇరుకున పడ్డ బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావు/న్యూఢిల్లీ, జూలై 20: బిఎస్పీ అధినేత్రి మాయావతిపై అభ్యంతరకర వ్యా ఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ బిజెపి ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్‌పై పార్టీ వేటు వేసింది. మాయావతిపై సింగ్ చేసిన వ్యాఖ్యలను అన్ని పార్టీల నేతలు తీవ్రంగా ఖండించడమే కాక ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడంతో బిజెపి అదిష్ఠానం సైతం ఇరుకున పడింది. ఓ వైపుగుజరాత్‌లో దళిత యువకులపై దాడి ఘటన పార్టీని కుదిపేస్తున్న తరుణంలో సింగ్ యుపి మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన దళిత నాయకురాలు మాయావతిపై అభ్యతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో పార్టీ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. రాజ్యసభలో ఈ ఉదంతం తీవ్ర గందరగోళానికి దారి తీసి చివరికి సభ వాయిదా పడ్డానికి దారి తీసింది. దీంతో స్వయంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దయాశంకర్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టడమే కాక పార్టీ తరఫున విచారం వ్యక్తం చేయాల్సి వచ్చింది. మరో వైపు పార్టీ సింగ్‌ను ఉత్తరప్రదేశ్ ఉపాధ్యక్ష పదవినుంచి తొలగించింది. ఉత్తరప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత దయాశంకర్ సింగ్ పార్టీ కార్యకర్తలతో సమావేశం కోసం తొలిసారి మావు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మాయావతి డబ్బులకు పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ‘ఎవరైనా కోటి రూపాయలిస్తే మాయావతి పార్టీ టికెట్ ఇస్తున్నారు. మరెవరైనా రెండు కోట్లిస్తే ముందు టికెట్ ఇచ్చిన వ్యక్తికి రద్దు చేసి అతనికి ఇస్తున్నారు. ఇంకొకరు 3 కోట్లు ఇస్తే అంతకు ముందు ఇచ్చిన వాళ్లకు కాదని వాళ్లకు ఇస్తున్నారు’ అంటూ అదే క్రమంలో తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరికి డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ సైతం ఒక ప్రముఖ దళిత మహిళపై అత్యం త తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సింగ్‌పై ప్రభుత్వం కటిన చర్యలు తీసుకోవాలని ఈ సభ కోరుతోందన్నారు. దీంతో సభా నాయకుడు, ఆర్థిక మంత్రి జైట్లీ లేచి పార్టీ తరఫున క్షమాపణ చెప్పడమే కాక సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవన్నారు.
ఆ సమయంలో సభలోనే ఉన్న మాయావతి సింగ్ వ్యాఖ్యలను ఖండంచినందుకు జైట్లీ సహా ఇతర పార్టీల సభ్యులకు కృతజ్ఞతలు చెబుతూ బిజెపి అగ్ర నేతలు ఈ విషయాన్ని చర్చించి సింగ్‌పై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.