జాతీయ వార్తలు

అట్టుడికిన గుజరాత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, జూలై 20: గుజరాత్‌లోని ఉనా పట్టణంలో దళిత యువకులను చితకబాదిన సంఘటనకు నిరసనగా బుధవారం దళిత సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. కొన్ని ప్రాంతాల్లో రాస్తారోకోలు, రాళ్లురువ్విన సంఘటనలు జరిగాయి. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ బుధవారం బాధితుల కుటుంబ సభ్యులను కలిశారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు ఉనాకు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం పట్టణానికి రానుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ శుక్రవారం రానున్నారు.
బుధవారం సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు పూర్తి బంద్‌ను పాటించాయి. అక్కడక్కడా రోడ్లపై వాహనాల రాకపోకలను అడ్డుకోవడం, రాళ్లు రువ్విన ఘటనలు జరిగాయి. మొత్తం మీద బంద్ ప్రశాంతంగా జరిగినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో బంద్ ప్రభావం లేదని వారు చెప్పారు.
ఈ నెల 11న ఉనా పట్టణంలో కొంతమంది దళిత యువకులు చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచారన్న ఆరోపణపై గో రక్షా సంఘాల సభ్యులు వారిని దారుణంగా చిత్రహింసలకు గురిచేసినందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం బంద్ సందర్భంగా రాష్టవ్య్రాప్తంగా పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలి, జునాగఢ్ నగరాలతో పాటు ధోరజి, ధ్రోల్ లాంటి చిన్న పట్టణాల్లో సైతం పూర్తి బంద్ జరిగింది. అక్కడక్కడా కొన్ని బస్సులపై దాడి, రాళ్లు రువ్విన సంఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. రాజ్‌కోట్‌లో సైతం బంద్ సందర్భంగా వీధుల్లో నిరసన ప్రదర్శనలు జరగడంతో పోలీసులు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. బంద్ దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా అధికారులు పలు మార్గాల్లో బస్సులను నిలిపివేశారు. అహ్మదాబాద్‌లో ఆందోళనకారులు కొన్నిచోట్ల బలవంతంగా దుకాణాలను, స్కూళ్లను మూసివేయించడం కనిపించింది. కాగా, ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ బుధవారం సంఘటన జరిగిన ఉనా జిల్లాలోని సమలియాల గ్రామాన్ని సందర్శించి బాధిత దళిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న
సిఎం ఆనంది బెన్ పటేల్

అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్న గుజరాత్ పోలీస్ దళాలు