జాతీయ వార్తలు

నమ్మకాన్ని వమ్ము చేయను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్, జూలై 20: అరుణాల్‌ప్రదేశ్‌లో నాలుగు రోజుల క్రితం గద్దెనెక్కిన పేమా ఖండూ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గింది. దీంతో కొన్ని నెలలుగా రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడిన రాష్ట్రం గాడిలో పడినట్లయింది. ముఖ్యమంత్రి ఖండూకు మద్దతు తెలియజేసే తీర్మానానికి 46 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా, ప్రతిపక్ష బిజెపికి చెందిన 11 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఖండూ తన బలాన్ని నిరూపించుకోవడానికి వీలుగా బుధవారం అసెంబ్లీని సమావేశపరచాలని ఆదేశిస్తూ రాష్ట్ర గవర్నర్ తథాగత్ రాయ్ మంగళవారం రాత్రి హడావుడిగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం సభ సమావేశమైనప్పుడు డిప్యూటీ స్పీకర్ టెన్జింగ్ నోర్బు తోంగ్‌డోక్ స్పీకర్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సభ మంత్రివర్గంపై విశ్వాసం తెలియజేస్తోందనే ఏకవాక్య తీర్మానాన్ని ముఖ్యమంత్రి ఖండూ ప్రవేశపెట్టగా మాజీ ముఖ్యమంత్రి నబమ్ టుకి దాన్ని బలపరిచారు. 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. అనంతరం సభ్యులనుద్దేశించి ఖండూ మాట్లాడుతూ తన నాయకత్వం పట్ల విశ్వాసం ఉంచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని తెగలను సమానంగా అభివృద్ధి చేయడం తన ప్రధాన బాధ్యత అని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు వీలుగా ప్రతి శాసనసభ్యుడికి తగిన నిధులుకేటాయించడంతోపాటు బాధ్యతలు సైతం నిర్ణయిస్తానని చెప్పారు.
స్పీకర్‌గా టోంగ్డోక్ ఎన్నిక
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా టేంజింగ్ నోర్బు టోంగ్డోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించిన తీర్మానాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే బమంగ్ ఫెలిక్స్ ప్రతిపాదించగా మరో సభ్యుడు పని తరమ్ బలపరిచారు. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ నబమ్ రెబియా రాజీనామాతో కొత్త స్పీకర్‌ను ఎన్నుకోవలసిన అవసరం ఏర్పడింది. స్పీకర్ పదవికి టోంగ్డోక్ నామినేషన్ ఒక్కటే రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. పశ్చిమ సియాంగ్ జిల్లా కలక్‌తంగ్ (ఎస్టీ) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టోంగ్డోక్ 2009లో రాజకీయాల్లోకి రావడానికి ముందు రాష్ట్ర పిడబ్ల్యుడి చీఫ్ ఇంజనీర్‌గా, విద్యుత్ శాఖ కార్యదర్శిగా పని చేశారు.