జాతీయ వార్తలు

సమాజాన్ని చీల్చేస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను అస్థిరపరుస్తోందని, సమాజాన్ని చీలుస్తోందంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం తన సంకుచిత సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్దడానికి పార్లమెంటులో ఉన్న ఆధిక్యతను లైసెన్సుగా భావిస్తోందని, అది తప్పుడు భావన అని ఆమె ధ్వజమెత్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సాగుతున్న ఈ సమయంలో బుధవారం తొలిసారిగా నిర్వహించిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను దగా చేసిందని దుయ్యబట్టారు. దళితులు, ఆదివాసీల హక్కులను అణచివేస్తోందని విమర్శించారు. ముఖ్యంగా మోదీ స్వంత రాష్ట్రం గుజరాత్‌లో నలుగురు దళితులను అందరూ చూస్తుండగా చితకబాది అవమానించిన సంఘటనను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. మోదీ ప్రభుత్వ హయాంలో సమాజంలో భయోత్పాతం సృష్టించేలా జరుగుతున్న దాడులకు గుజరాత్ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమేనని ఆమె అన్నారు. గత కొన్ని నెలల్లో మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను అస్థిరపరచడానికి, సమాజాన్ని చీల్చడానికి, రాజ్యాంగ విలువలను ధ్వంసం చేయడానికి ఎలా బరితెగించిందో మనం చూశామని సోనియా వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ఆధిక్యం వల్ల రాజ్యాంగ సూత్రాలను పాటించకుండా ఉండటం, రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఉండటం సాధ్యం కాదనే విషయాన్ని ప్రభుత్వం మరచిపోయినట్టు ఉందని సోనియాగాంధీ అన్నారు. కాశ్మీర్ లోయలో ఇటీవల జరిగిన సంఘటనలు విచారకరమని, ఇలాంటివి దేశానికే ముప్పు అని పేర్కొన్నారు. దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఉగ్రవాదులను గట్టిగా ఎదుర్కోవలసిందేనని అన్నారు. అయితే ఎంతోమంది యువకుల ప్రాణాలు పోవడానికి దారితీసిన పరిస్థితులేంటనే విషయాన్ని మనం ప్రశ్నించుకోవాలని అన్నారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానంపైనా సోనియాగాంధీ ధ్వజమెత్తారు.