జాతీయ వార్తలు

ఎన్‌పిటిపై సంతకం చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో భారత్ చేరికపై చైనాతో ఉన్న విభేదాలను తొలగించుకునేందుకు ఆ దేశంతో చర్చలు జరుపుతున్నట్టు భారత్ బుధవారం ప్రకటించింది. అయితే భారత్ ఎప్పటికీ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయబోదని ప్రభు త్వం స్పష్టం చేసింది.
ఏ దేశమైనా ఎన్‌ఎస్‌జిలో చేరాలంటే అది తప్పనిసరిగా ఎన్‌పిటిపై సంతకం చేసి ఉండాలన్న నిబంధనను ప్రస్తావించడం ద్వారా భారత్ చేరికను ఇటీవల చైనా అడ్డుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కొన్ని అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఎన్‌పిటిపై సంతకం చేయని దేశం ఎన్‌ఎస్‌జిలో ఎలా చేరగలుగుతుందని ఇటీవల చైనా ప్రశ్నించిందని, అయితే తాము ఆ దేశంతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. భారత్ ఎన్‌ఎస్‌జిలో చేరికకోసం తన కృషిని ఆపలేదని పేర్కొంటూ, ఏ దేశమైనా దీన్ని వ్యతిరేకించి ఉన్నందున, ఇక ఆ దేశం ఎప్పటికీ అంగీకరించబోదని అర్థం కాదని మంత్రి చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె ఎన్‌ఎస్‌జిపై చైనా వైఖరిని, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)పై కాంగ్రెస్ పార్టీ వైఖరితో పోల్చారు. కాంగ్రెస్ మిత్రులు జిఎస్‌టి బిల్లు ఆమోదానికి గత నాలుగు సెషన్లుగా అంగీకరించడం లేదని, ఇప్పుడు కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు అంగీకరించాయని, కేవలం కాంగ్రెస్ వల్లే బిల్లు ఆగిపోయిందని పేర్కొంటూ దానర్థం కాంగ్రెస్ ఎప్పటికీ జిఎస్‌టికి అంగీకరించదని కాదని, ఈ సెషన్‌లోనే బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉందని అన్నారు. గుజరాత్‌లో దళితులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో మంత్రి ఈ విషయం చెప్పారు.