జాతీయ వార్తలు

అపార్ట్‌మెంట్స్ కూల్చవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: ముంబయిలోని వివాదాస్పద ఆదర్శ్ అపార్ట్‌మెంట్స్‌ను కూల్చివేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. 31 అంతస్తుల అపార్ట్‌మెంట్స్‌ను పడగొట్టాలంటూ బాంబే హైకోర్టు గతంలో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును పలువురు యజమానులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. బహుళ అంతస్తుల ఆదర్శ అపార్ట్‌మెంట్‌ను కూల్చవద్దని జస్టిస్ జె చలమేశ్వర్, జస్టిస్ ఎఎం సప్రేతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. అపార్ట్‌మెంట్స్‌ను కూల్చవద్దని, ఆగస్టు 5నాటికి కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్‌కు కోర్టు సూచించింది. కార్గిల్ యుద్ధ వీరుల కోసం ముంబయిలోని కొలాబా ప్రాంతంలో ఈ అపార్ట్‌మెంట్స్ నిర్మించింది. 31 అంతస్తుల భవనంలో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు అక్రమంగా ఫ్లాట్లు సంపాదించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తన బంధువుల పేరుతో మూడు ఫ్లాట్లు సంపాదించారన్న ఆరోపణలతో పదవిని కోల్పోవల్సి వచ్చింది. అధికార దుర్వినియోగానికి పాల్పడిన నేతలు, అధికారులపై ముంబయి పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై బాంబే హైకోర్టు ఆదర్శ్ సొసైటీ నిర్మించిన అపార్ట్‌మెంట్స్‌ను కూల్చివేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖను ఆదేశించింది. హైకోర్టు తీర్పును పలువురు సుప్రీం కోర్టులు సవాల్ చేయగా శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది.