జాతీయ వార్తలు

మమ్మల్ని వేధిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూలై 22: బిఎస్పీ అధినేత్రి మాయావతిపై ఉత్తరప్రదేశ్ బిజెపి నేత దయాశంకర్ సింగ్ అసభ్య వ్యాఖ్యల వివాదం శుక్రవారం కొత్త మలుపు తిరిగింది. తన భర్త ప్రాణాలు తీసేంతవరకు నిద్ర పోరని ఆరోపిస్తూ మాయావతిపైన, ఆమె పార్టీకి చెందిన నాయకులపైన దయాశంకర్ భార్య నగరంలోని హజరత్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిఎస్పీ నేతలు, కార్యకర్తలు తమ బూతులు తిడుతూ, తమను మానసిక వేదనకు గురి చేస్తున్నారని దయాశంకర్ సింగ్ భార్య స్వాతి అంతకు ముందు విలేఖరుల వద్ద వాపోయారు. ఈ సంఘటన తర్వాత తన 12 ఏళ్ల కుమార్తె షాక్‌కు లోనయిందని ఆమె అంటూ, మాయావతిపైన, ఆమె పార్టీకి చెందిన ఇతర నాయకులపైన తాను తప్పకుండా కేసు పెడ్తానని, న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. తమ కుటుంబాన్ని అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆమె ఆరోపించారు. ‘నా భర్త రాజకీయాల్లో ఉన్నారు. అయితే మేము రాజకీయాల్లో లేము. బిఎస్పీ నేతలు గురువారం నిరసన ప్రదర్శన సందర్భంగా ప్రవర్తించిన తీరు, వారు ఉపయోగించిన భాష చాలా అవమానకరంగా ఉంది’ అని స్వాతి అన్నారు. ‘నా భర్తపై ఎఫ్‌ఐఆర్ నమోదయింది.. పదవినుంచి తప్పించారు.. పార్టీనుంచి కూడా బహిష్కరించారు..., అయినప్పటికీ మాయావతికి సంతృప్తి లేదు. ఆయన తల తీసేయాలని కోరుకుంటున్నారు. మమ్మల్ని తీవ్ర వ్యథకు గురి చేస్తున్నారు’ అని ఆమె అన్నారు. తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పార్టీ నేతలపై మాయావతి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. తన భర్త చేసింది తప్పయితే ఇతరులు చేసింది కూడా తప్పే కదా? అని స్వాతి ప్రశ్నించారు. తమ నాయకురాలు మాయావతిని అవమానించే విధంగా నిందాపూర్వక వ్యాఖ్యలు చేసిన బిజెపి నేత దయాశంకర్ సింగ్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బిఎస్పీ కార్యకర్తలు గురువారం లక్నోలోని హజరత్ గంజ్‌లోని అంబేద్కర్ వాగ్రహం ముందు భారీ ధర్నా నిర్వహించడం తెలిసిందే. ఈ సందర్భంగా వారు అవమానకరమైన వ్యాఖ్యలతో ఉన్న బ్యానర్లను ప్రదర్శించడమే కాక,నినాదాలు కూడా చేశారు.

మాయావతిపై శుక్రవారం దాఖలు చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదును చూపిస్తున్న బిజెపి నుంచి బహిష్కృతుడైన దయాశంకర్ భార్య స్వాతి