జాతీయ వార్తలు

ఆపారు గానీ.. అడ్డుకోలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: ప్రత్యేక హోదాపై ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రస్తుతం రాజ్యసభలో వాయిదా వేయగలిగారే దాన్ని ఓటింగ్ రాకుండా అడ్డుకోలేరని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్‌రావుస్పష్టం చేశారు. ఈ బిల్లు రాజ్యసభలో మళ్లీ అడ్డుకోడానికి ఎన్ని కుట్రలు చేస్తారో చూడాలని ఆయన అన్నారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై అనేక పార్టీలు ముక్తకంఠంలో ఖండించాయని శుక్రవారం ఇక్కడ చెప్పారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీలకు రాజ్యసభ సభ్యులకు, టిఆర్‌ఎస్, వామపక్షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
బాబు అల్టిమేటం ఇవ్వాలి: దిగ్విజయ్
ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ద్రానికి అల్టిమేటం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఏపికి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని, సాక్షాత్తూ అప్పటి ప్రధాని ఇచ్చిన హామీనే ఎందుకు అమలు చేయడం లేదని దిగ్విజయ్ ప్రశ్నించారు. కెవిపి ప్రవేశపెట్టిన ప్రైవేటుమెంబర్ బిల్లు శుక్రవారం ఆమోదం పొందుతుందని తెలిసీ దాన్ని అడ్డుకోడానికి బిజెపి కుయుక్తులు పన్నిందని మండిపడ్డారు. రాజ్యసభకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధంలేని ఆప్ వ్యవహారాన్ని బిజెపి సభలో లేవనెత్తడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రైవేటు బిల్లుకు అన్ని పార్టీలూ మద్దతు ఇచ్చినా ఒక్క బిజెపి శుక్రవారం డ్రామాలాడుతూ సభ వాయిదా పడేలాచేసిందని ఆయన దుయ్యబట్టారు.
బిజెపి తీరు గర్హనీయం: చిరంజీవి
హోదాపై కెవిపి ప్రవేశపెట్టిన బిల్లు విషయంలో ఎపికి శుక్రవారం తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. బిజెపి కావాలనే అనవసర విషయాలను సభలో లేవనెత్తి బిల్లు ఓటింగ్ రాకుండా అడ్డుకుందని ఆయన విమర్శించారు. ఏపి ప్రజల అత్మ గౌరవానికి భంగం కలిగేలా బిజెపి వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతానికి ప్రైవేటు మెంబర్ బిల్లు అడ్డుకున్నా, ఎప్పటికైనా ఓటింగ్‌కు వచ్చితిరుతుందని చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు.
బిజెపి పారిపోయింది: రఘువీరా
ప్రైవేటు మెంబర్ బిల్లును రాజ్యసభలో ఓటింగ్ రానివ్వకుండా బిజెపి పారిపోయిందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. గత మూడు రోజులుగా బిల్లు సభలో రాకుండా బిజెపి. టిడిపి కుట్రలు చేశాయన్నారు. బిల్లుకి రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ఏమిటో బిజెపికి తెలిసిందని ఆయన తెలిపారు. కెవిపి ప్రైవేటు బిల్లుకు పది పార్టీలు మద్దతు ఇచ్చాయని ఆయన చెప్పారు. అందుకే బిల్లు ఓటింగ్ వచ్చినపుడు దొడ్డిదారిన సంబంధం లేని అంశాన్ని రాజ్యసభలో బిజెపి లేవనెత్తిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, ప్రధాని నరేంద్ర మోదీలు బిల్లు రాకుండా కుట్ర చేశారని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్, టిడిపిలే కారణం: విజయసాయి
ప్రత్యేకహోదా ప్రైవేటు మెంబర్ బిల్లు విషయంలో టిడిపి చిత్తశుద్ధి ఏమిటో శుక్రవారం రాజ్యసభలో బయటపడిందని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు మెంబర్ బిల్లు ఓటింగ్ రాకపోవాడానికి అధికార, ప్రతిపక్షాలే కారణం అని విమర్శించారు. కాంగ్రెస్, బిజెపిలు తీరు మూలంగానే సభ వాయిదా పడిందని ఆయన తప్పుపట్టారు.
కాంగ్రెస్‌కు చిత్తశుద్ధిలేదు: సుజనాచౌదరి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ప్రైవేటు మెంబర్ బిల్లు విషయంలో కాంగ్రెస్‌పార్టీకి చిత్తశుద్ధి లేదని కేంద్రమంత్రి సుజనా చౌదరి ఆరోపించారు. శుక్రవారం రాజ్యసభలో ప్రైవేటు బిల్లు రాకపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆయన ఎదురుదాడి చేశారు. ఆప్ ఎంపీ భగవంత్ మాన్‌సింగ్ అంశంపై చర్చకు అనుమతించాలని రాజ్యసభలో బిజెపి ఎంపీలు డిమాండ్ చేశారని, దానికి కాంగ్రెస్ ఎంపీలు అంగీకరించి ఉంటే చర్చ గంటన్నరలో ముగిసిపోయేదని సుజన అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత కెవిపి బిల్లుపై ఓటింగ్ జరిగి ఉండేదని ఆయన అన్నారు. కాగా టిడిపి ఎంపీ సిఎం రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విమర్శలుమాని ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని సలహా ఇచ్చారు. సోమవారం నుంచి పార్లమెంట్ ఉభయ సభలు అడ్డుకోవాలని కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు.
తప్పు కేంద్రానిదే: ఉండవల్లి
రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లు ఓటింగ్‌కు రాకపోవడానికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని, ఎన్‌డిఏనే ప్రధమ ముద్దాయి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని, నాటి ప్రధాని ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదని ఆయన విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు ఎంపీలు కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. విభజన సమయంలో జరిగిన అఘాయిత్వం కంటే శుక్రవారం రాజ్యసభలో చోటుచేసుకున్న ఘటన ఎక్కువని ఆయన అభిప్రాయపడ్డారు.

చిత్రం... న్యూఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న ఏపి కాంగ్రెస్ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామాచందర్‌రావు తదితరులు