జాతీయ వార్తలు

మళ్లీ రెండు వారాల తర్వాతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 22: ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌సభ సభ్యుడు భగవంత్ సింగ్ మాన్ నిర్వాకం మూలంగా శుక్రవారం ఓటింగ్‌కు ఏపీ ప్రత్యేక హోదాకు ప్రైవేట్ మెంబర్ బిల్లు రెండు వారాల తరువాత మరోసారి రాజ్యసభ ముందుకు వస్తుంది. కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు ప్రతిపాదించిన ఈ బిల్లుపై రెండు వారాల తరువాత కూడా ఓటింగ్ జరుగుతుందా? అనేది అనుమానమే. అప్పుడు కూడా ఓటింగ్ జరగకపోతే ఇది మళ్లీ శీతాకాల సమావేశాల్లోనే పరిశీలనకు వస్తుంది. రాజ్యసభ అనేది నిరంతరం కాబట్టి ఈ సభకు సంబంధించిన ఏ బిల్లు కూడా మురిగిపోదు. అందుకే ఈ ప్రైవేటు బిల్లుపై ఏదోఒక రోజు రాజ్యసభలో ఓటింగ్ జరపక తప్పదు. తనంత తాను కెవిపి ఈ బిల్లును ఉపసంహరించుకోనంత వరకు ఇది సభ పరిశీలనలో ఉంటుంది. ఆయన పట్టుబడితే ఓటింగ్ జరపకతప్పదు. ఏపికి ప్రత్యేక హోదాకు సంబంధించిన బిల్లు కాబట్టి దీనిని బిజెపి బాహాటంగా వ్యతిరేకించదు.ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న తెలుగు దేశం పార్టీ దీనికి మద్దతివ్వక తప్పదు.