జాతీయ వార్తలు

చంపబోయాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. విద్యుత్ కోతల గురించి అడిగేందుకు వెళ్లిన తనను హతమార్చబోయాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌ను అరెస్టు చేశారు. ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే ఖాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన అనంతరం ఆయన్ను అరెస్టు చేశారు. అయితే, తనపై తప్పుడు ఫిర్యాదు చేయాలని పోలీసులు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారని ఖాన్ ఆరోపించారు. విద్యుత్ కోతలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 22న సదరు మహిళ వెళ్లిందని, తిరిగి వస్తున్న సమయంలో ఓ వాహనం ఆమెను గుద్దేందుకు ప్రయత్నించిందని, ఆ వాహనంలో ఎమ్మెల్యే ఖాన్ ఉన్నారని, మహిళ చేసిన ఫిర్యాదును మేజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేసినట్లు పోలీస్ జాయింట్ కమిషనర్ ఆర్.పి.ఉపాధ్యాయ వెల్లడించారు. కాగా, అంతకుముందు ఈ నెల 19న జామియా నగర్‌లోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన ఆ మహిళను హతమారుస్తామని ఓ యువకుడు బెదిరించాడని, ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని హెచ్చరించాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైందని, ఎమ్మెల్యేపై వచ్చిన ఫిర్యాదులు నాన్ బెయిలబుల్ కావడంతో ఆయన్ను అరెస్టు చేశామని ఉపాధ్యాయ వెల్లడించారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆ మహిళ శనివారం మూడు ఫిర్యాదులు దాఖలు చేయడంతో ఆమెకు రక్షణ కల్పించారు. విద్యుత్ కోతలకు సంబంధించి ఈ నెల 10న ఎమ్మెల్యే ఖాన్‌కు ఫోన్ చేశానని, ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన నివాసానికి వెళ్లినట్లు ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది.

చెరచబోయాడు!
రైల్లో మైనర్‌పై బిజెపి ఎమ్మెల్సీ అత్యాచార యత్నం
అరెస్టు... 14 రోజుల కస్టడీ... పార్టీనుంచి సస్పెన్షన్
పాట్నా/హాజిపూర్, జూలై 24: బీహార్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్సీ తున్నాజీ పాండే ఓ బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేయడంతో పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. గోరఖ్‌పూర్ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌లో పనె్నండేళ్ల తమ కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసినట్లు ముజఫర్‌పూర్ రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ బి.ఎన్.ఝా వెల్లడించారు. ఏసి-2టైర్‌లో ప్రయాణిస్తున్న తమ కుమార్తెను ఎమ్మెల్సీ పాండే ముద్దు పెట్టుకున్నాడని, టాయ్‌లెట్‌కు రమ్మని పిలిచాడని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. హాజిపూర్ జంక్షన్‌కు దగ్గరలో ఉన్న సరాయ్ స్టేషన్‌లో తెల్లవారుజామున 3 గంటలకు జరిగిందన్నారు. బోగీలో వేర్వేరుచోట్ల బెర్త్‌లు దొరకడంతో, ఎమ్మెల్సీ చర్యకు బెంబేలెత్తిన బాలిక గట్టిగా అరవడంతో తల్లిదండ్రులు ఆమెను చేరుకున్నారని ఝా వెల్లడించారు. రైల్లో ఉన్న ఎస్కార్ట్ పోలీసులు ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకుని హాజీపూర్‌లో జిఆర్‌పికి అప్పగించారు. జిల్లా మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే, ఈ ఆరోపణలను పాండే ఖండించారు. చార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్‌ను తీసుకునేందుకు లైటు వేయడంతో ఆ బాలిక ఒక్కసారిగా ఉలిక్కిపడి అరిచిందని తెలిపారు. ఈ విషయాన్ని హాజీపూర్ చేరేవరకూ తల్లిదండ్రులకు నచ్చచెపుతూనే ఉన్నానని జిఆర్‌పి పోలీసుస్టేషన్‌వద్ద విలేఖరులకు తెలిపారు. మరో ఐదురోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన రాష్ట్ర బిజెపిని కుదిపేసింది. ఎమ్మెల్సీపై ఫిర్యాదు నమోదైన మరుక్షణమే ఆయన్ను పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బిజెపి సీనియర్ నాయకుడు సుశీల్‌కుమార్ మోదీ ట్వీట్ చేశారు. ఈ పరిణామం జెడియుకు అస్త్రంగా మారనుంది.