జాతీయ వార్తలు

దేశంలో ఎదగని పిల్లలు 4.8కోట్ల మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, జూలై 26: ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో 4కోట్ల 80లక్షల మంది పిల్లలు భారతదేశంలో ఎదగకుండా ఉన్నారని తాజా పరిశోధనలో వెల్లడైంది. దేశంలో పారిశుధ్య సమస్య, మరుగుదొడ్లు లేకపోవటం పిల్లల పాలిట శాపంగా మారిందని వాటర్ ఎయిడ్ అనే ఓ అంతర్జాతీయ అభివృద్ధి చారిటీ సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. ప్రతి అయిదుగురు పిల్లల్లో ఇద్దరు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారని అందులో వివరించారు. భౌతికంగానే కాక, మానసిక ఎదుగుదల కూడా పిల్లల్లో ఉండటం లేదని స్పష్టం చేశారు. ఆగ్నేయాసియా దేశాలలో కొత్తగా వెలసిన తైమోర్ లెస్టె 58శాతంతో మొదటిస్థానంలో ఉండగా నైజీరియా, పాకిస్తాన్ రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. శిశువుకు తొలి రెండు సంవత్సరాలు మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించాల్సి ఉందని, ఈ వయస్సు తిరిగి రానిదని ఆ నివేదిక తెలిపింది. భారత్‌లో చాలామంది ప్రజలు మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నారని కూడా వివరించింది. ఈ కారణంగానే పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం లభించక పిల్లల్లో ఎదుగుదల తగ్గిపోతోందని స్పష్టం చేసింది. పరిశుభ్రమైన వాతావరణం లేక చుట్టుపక్కల పరిసరాలు కలుషితమై రోగాలు, ఇనె్ఫక్షన్‌లకు కారణమవుతోందని పేర్కొంది. సురక్షిత నీరు. పారిశుధ్యం, చేతులను సబ్బుతో ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయటం వంటివి లేకపోవటం వల్ల అతిసారం వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని పేర్కొంది. దేశంలో 1,40,000 మంది పిల్లలు అతిసార వ్యాధితో బాధపడుతున్నారని వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 650మిలియన్ల మంది ప్రజలు పరిశుభ్రమైన నీరు దొరక్క బాధపడుతున్నారని, 2.3మిలియన్ల ప్రజలు వౌలిక పారిశుధ్య సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని వాటర్ ఎయిడ్ ఇండియా పాలసీ మేనేజర్ అరుంధతీ మురళీధరన్ పేర్కొన్నారు.