జాతీయ వార్తలు

మల్టీలెవెల్ పార్కింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: ఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్‌లో మల్టీ లెవల్ పార్కింగ్ విధానం అమలుకు ప్రయత్నిస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్యారా తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మంగళవారం ఇక్కడ తెలిపారు. హైదరాబాద్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉత్తమ విధానాలను అవలంబిస్తున్న నగరాలను అధ్యయనం చేయడంలో భాగంగా మేయర్ రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి సహా అధికారుల బృందం ఢిల్లీలో పర్యటించింది. కనీస సౌకర్యాలైన టాయిలెట్లు, పార్కింగ్, ఫుట్‌పాత్‌ల నిర్వహణలో న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన చర్యలను పరిశీలించారు. దేశ రాజధానిలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బస్ షెల్టర్లు, పబ్లిక్ టాయిలెట్లు, బస్‌బేలు ఫుట్‌పాత్‌లు, ఉచిత టాయిలెట్లు చూశారు. న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ నరేశ్ కుమార్‌తో బృందం భేటీ అయింది. న్యూఢిల్లీ కార్పొరేషన్లో అమలవుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలపై రూపొందించిన యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని మేయర్ బృందానికి వివరించారు. అనంతరం మేయర్ రామ్మోహన్ విలేఖరులతో మాట్లాడుతూ అండర్ పార్కింగ్, అవసరమైతే ప్రైవేట్ పార్కింగ్ ఏర్పాటు చేసుకుని నిర్వహణ బాధ్యతలు చేపట్టిందుకు ముందుకొచ్చేవారిని ప్రోత్సహించేందుకు సిద్ధమన్నారు. ఎన్‌డిఎంసి చేపట్టిన అండర్ గ్రౌండ్ పార్కింగ్ విధానాన్ని హైదరాబాద్‌లోనూ తీసుకొచ్చే అంశంపై దృష్టి సారించామన్నారు.