జాతీయ వార్తలు

బిజెపి సభ్యులపై కెవిపి సభాహక్కుల నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: ఏపి కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు అధికార బిజెపి సభ్యులపై సభా హక్కుల నోటీసు ఇచ్చారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీతోపాటు పలువురు బిజెపి సభ్యులు గత శుక్రవారం రాజ్యసభలో తాను ప్రతిపాదించిన ప్రత్యేక హోదా సవరణ బిల్లుపై ఓటింగ్ జరగకుండా చూసేందుకు పోడియం వద్దకు వచ్చి కుట్ర పూరితంగా వ్యవహరించారని కెవిపి ఆరోపించారు. బిజెపి సభ్యులు పోడియం వద్ద గొడవ చేయటం ద్వారా తన హక్కులకు భంగం కలిగించారని, వారిపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి డిప్యూటీ స్పీకర్ పిజె కురియన్ స్పందిస్తూ కెవిపి ఇచ్చిన నోటీసు సభాధ్యక్షుడు హమీద్ అన్సారీ పరిశీలనలో ఉందని, ఓపిక పట్టాలని కురియన్ సూచించటంతో కెవిపి శాంతించారు. కాగా ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సంబంధించిన సవరణ బిల్లును ప్రతిపాదించిన ఏడాది తరువాత ప్రభుత్వం దీనిని మనీ బిల్లుగా చిత్రీకరించటం సిగ్గు చేటని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు దుయ్యబట్టారు. రామచందర్‌రావు మంగళవారం సాయంత్రం విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా సవరణ బిల్లు మనీ బిల్లు పరిధిలోకి వస్తే దీనిపై చర్చ ఎందుకు జరిపారని, అలాగే మంత్రి సమాధానం ఎందుకు ఇచ్చారని నిలదీశారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించిన తరువాతనే ఈ బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చిందని కెవిపి గుర్తుచేశారు. ‘ఎన్నో గంటల పాటు దీనిపై చర్చ జరిగింది. మంత్రి దీనికి సమాధానం ఇచ్చారు. ఓటింగ్ సమయంలో గొడవమూలంగా ఆగిపోయింది’ అని ఆయన చెప్పారు. ఆంధ్ర ప్రజలను తిరుగులేని విధంగా దెబ్బకొట్టేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను బిజెపి ప్రయోగించిందని విమర్శించారు. ఒక కుట్ర ప్రకారం ప్రత్యేక హోదా బిల్లుపై ఓటింగ్ జరపకుండా ప్రభుత్వం అడ్డుతగులుతోందన్నారు.

జిఎస్‌టికి షరతులతో
కూడిన మద్దతు: ఈటల

న్యూఢిల్లీ, జూలై 26: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక భావిస్తున్న జిఎస్‌టికి కొన్ని షరతులతో కూడిన మద్దతు ఇస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఈటల పాల్గొన్నారు. సమావేశానంతరం రాజేందర్ మాట్లాడుతూ జిఎస్‌టి రాష్ట్రాల ఆర్థిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేలా ఉండాలని కేంద్రానికి సూచించామన్నారు. జిఎస్‌టి వల్ల రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా చూడాలని సమావేశంలో కోరినట్టు ఈటల పేర్కొన్నారు. జిఎస్‌టిలో రాష్ట్రాల పన్నుల వాటా, అధికారాల ఎక్కువగా ఉండాలని కోరినట్టు మంత్రి తెలిపారు. తెలంగాణకు కేంద్రం నుంచి సిఎస్‌టి బకాయిలు రూ.10,440 కోట్లు పరిహారం రావాల్సి ఉందని, జిఎస్‌టి అమలుకు ముందే ఈ బకాయిలు చెల్లిస్తే ఇరువురి మధ్య విశ్వాసం ఉంటుందని ఆర్థికశాఖ మంత్రుల సమావేశంలో ఈటల స్పష్టం చేశారు.