జాతీయ వార్తలు

జిఎస్‌టిపై మరింత ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: దేశ వ్యాప్తంగా ఒకే పన్నుల విధానాన్ని అమలు చేయడానికి ఉద్దేశించిన వస్తు సేవల బిల్లు (జిఎస్‌టి) ఆమోదానికి కేంద్రం మరింతగా మార్గాన్ని సుగమం చేసుకుంది. ఈ పరోక్ష పన్నుల వ్యవస్థ అమలులోకి వచ్చే మొదటి ఐదేళ్ల పాటు రాష్ట్రాలకు కలిగే ఆర్థిక నష్టాన్ని నూటికి నూరు శాతం భర్తీ చేయడానికి కేంద్రం అంగీకరించింది. అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పట్టుబడుతున్న ఒక శాతం అదనపు అంతర్‌రాష్ట్ర పన్ను ప్రతిపాదననూ విరమించుకుంది. ఈ మేరకు జిఎస్‌టి రాజ్యాంగ సవరణ బిల్లులో చేపట్టిన మార్పులను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదించింది. ప్రస్తుతం ఉన్న బిల్లు ప్రకారం రాష్ట్రాల రెవిన్యూ నష్టాన్ని మొదటి మూడేళ్లలో వంద శాతం, నాలుగో సంవత్సరంలో 75శాతం, ఐదో సంవత్సరంలో 50శాతం భర్తీ అవుతుంది. ఈ సవరణ ద్వారా ఐదేళ్ల పాటూ రాష్ట్రాల నష్టాన్ని పూర్తిగా భరించేందుకు కేంద్రం అంగీకరించింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం తలెత్తినా దాన్ని జిఎస్‌టి కౌన్సిల్ ద్వారా పరిష్కరించుకోవాలని కూడా ఈ తాజా సవరణ బిల్లులో ప్రతిపాదించారు. ఈ కౌన్సిల్‌లో కేంద్ర,రాష్ట్రాలకు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. విపక్షాల డిమాండ్లకు కేబినెట్ ఆమోదం లభించిన నేపథ్యంలో జిఎస్‌టి బిల్లుకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలోనే ఆమోదం లభించగలదన్న ధీమాను ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. మారిన కొత్త రూపుతో ఈ బిల్లు ఈ వారంలోనే రాజ్యసభ పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. లేక పోతే కచ్చితంగా వచ్చే వారం పెద్దల సభ దీన్ని చేపడుతుంది. మే నెల్లోనే లోక్‌సభ ఆమోదించిన రాజ్యాంగ సవరణలనే తాజా కేబినెట్ ఆమోదించినప్పటికీ..ఈ సవరణలను రాజ్యసభ ఆమోదిస్తే మళ్లీ ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందాల్సి ఉంటుంది. మొదటి ఐదేళ్ల పాటూ రాష్ట్రాల నష్టాన్ని పూర్తిగా భర్తీ చేస్తామని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ మేరకు సవరణలను కేబినెట్ ఆమోదించింది.
కీలకాంశాలు
*మొదటి ఐదేళ్లూ పూర్తిగా
రాష్ట్రాల రెవిన్యూ నష్టం భర్తీ
* అంతర్రాష్ట అమ్మకాలపై
1శాతం అదనపు పన్ను యోచన రద్దు
* జిఎస్‌టి కౌన్సిల్‌లోనే వివాదాల పరిష్కారం