జాతీయ వార్తలు

ఆశలు హుళక్కి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏన్నో ఆశలు పెట్టుకొన్న శాసనసభ నియోజకవర్గాల సంఖ్య పెంపుపై కేంద్రం నీళ్లు చల్లింది. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెంపు ఇప్పట్లో సాధ్యంకాదని స్పష్టం చేసింది. నియోజక వర్గాలు పెంచాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరని తెలిపింది. ఏపీ, తెలంగాణల్లో శాసనసభ స్థానాల సంఖ్య పెంపుపై టీడీపీ ఎంపీ టి.దేవేందర్‌గౌడ్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ సమాధానమిచ్చింది. ముఖ్యంగా సీట్ల సంఖ్య పెంపునకు న్యాయశాఖ, అటార్నీ జనరల్ అభిప్రాయాలు తీసుకొన్నారా? అని దేవేందర్‌గౌడ్ ప్రశ్నించారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ ఆహిర్ లిఖిత పూర్వక సమాధానమిస్తూ అటార్నీ జనరల్ అభిప్రాయాలను న్యాయశాఖ తీసుకుందని వెల్లడించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్-26కు సవరణ చేసినా, ఆర్టికల్ 170కి కూడా సవరణ అవసరమా? అని అని అటార్నీ జనరల్‌ను ప్రశ్నించామని మంత్రి వెల్లడించారు. సెక్షన్-26కు సవరణ చేసినా, ఆర్టికల్ 170 ప్రకారం ఇప్పటికిప్పుడు సీట్లు పెంపు సాధ్యంకాదని అటార్నీ జనరల్ స్పష్టం చేసినట్లు వెల్లడించారు. శాసనసభ స్థానాల పెంపు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.