జాతీయ వార్తలు

మొక్కుబడి చందంగా స్వచ్ఛ్భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔరంగాబాద్, జూలై 27: మహోధృతంగా ప్రారంభమైన స్వచ్ఛ్భారత్ కార్యక్రమం ప్రస్తుతం ఓ సువర్ణావకాశాన్ని కోల్పోయిన చందంగా మారిందని పారిశుధ్య నిపుణుడు గౌరీశంకర్ ఘోష్ తీవ్రస్వరంతో వ్యాఖ్యానించారు. అనుకున్న స్థాయిలో ఇది ముందుకు సాగకపోవడం వల్ల పారిశుధ్య భారత్ ఆవిష్కరణ గాడి తప్పిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ బృహత్తర కార్యక్రమం ఎన్ని మరుగుదొడ్లు కట్టారన్న లెక్కలకే పరిమితమైందని స్వచ్ఛ్భారత్ ప్రజోద్యమంగా రూపుదిద్దుకోలేకపోయిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే అందుకు వౌలికంగా చేపట్టాల్సిన ఏ చర్యనూ చిత్తశుద్ధితో నిర్వర్తించకపోవడంవల్ల ఈ కార్యక్రమం ప్రాధాన్యత తగ్గిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే గంగా పారిశుధ్య ప్రణాళిక సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలతోనూ దీన్ని సంధానం చేయాలని, దానికి ప్రజల భాగస్వామ్యం తోడు కావాలని ఆయన అన్నారు. మిగతా కార్యక్రమాల మాదిరిగానే ఇదికూడా ఓ నామమాత్ర ప్రభుత్వ కార్యక్రమంగా మారిందని అన్నారు. స్వచ్ఛ్భారత్ అంటే పరిపూర్ణమైన పారిశుధ్యం అన్న అర్థం ఉందని, కానీ ఇది పూర్తిగా మరుగుదొడ్లను లెక్కించి సరిపెట్టుకునే కార్యక్రమంగానే మారిపోయిందని పేర్కొన్నారు. భారత్‌లో పారిశుధ్య అవసరాన్ని రెండేళ్ల క్రితమే గుర్తించారన్నట్లుగా వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. నిజానికి 1986లోనే అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ పారిశుధ్య కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో చేపట్టారని, దాన్ని బలోపేతం చేయడానికి అనేక ప్రభుత్వ కార్యక్రమాలనుంచి నిధులను సమీకరించారని గుర్తుచేశారు.
స్వచ్ఛ్భారత్ అనుకున్న స్థాయిలో ప్రజోద్యమం కాకపోవడానికి కారణం దీన్ని గంగా కార్యాచరణతో అనుసంధానం చేయకపోవడం ఒకటైతే, రెండోది పాఠశాల విద్య కార్యక్రమంతో పరిసరాల శుభ్రతను మిళితం చేయకపోవడం మరొకటని, వీటన్నింటి కారణంగా ఇది ప్రజా ఉద్యమం కాలేకపోయిందని తెలిపారు.
‘షర్మిలపై కేసులన్నీ రద్దు చేయండి’
కోల్‌కతా, జూలై 27: మానవ హక్కుల ఉద్యమ నేత ఇరోమ్ చాను షర్మిల 16ఏళ్లుగా సాగిస్తున్న తన నిరాహారదీక్షను ఆగస్టు 9న విరమించే లోగా ఆమెపై మోపిన అభియోగాలన్నిటినీ ఉపసంహరించుకోవలసిందిగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ మణిపూర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం షర్మిలను తక్షణం బేషరతుగా విడుదల చేయాలని, ఆమెపై మోపిన అభియోగాలన్నిటినీ ఉపసంహరించుకోవాలని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. షర్మిల మంగళవారం చేసిన ప్రకటనతో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా ఆమె సాగిస్తున్న చరిత్రాత్మక పోరాటం కొత్త మలుపు తిరగనుందని భారత్‌లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌లో ప్రాజెక్టు మేనేజర్ అయిన అరిజిత్ సేన్ అన్నారు. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల 16 ఏళ్లుగా నిరాహారదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. రెండు దశాబ్దాల కాలంలో మణిపూర్‌లో చట్టాలను ఉల్లంఘించి జరిపిన హత్యలకు సంబంధించిన 1528 కేసులను దర్యాప్తు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిన తరుణంలో శర్మిల తన దీక్షను విరమించుకొంటున్నట్లు ప్రకటించడం గమనార్హమని ఆయన అన్నారు.